స్విమ్‌సూట్‌లో మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న వీడియో
తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన హీరోయిన్లలో కొందరు మాత్రమే సక్సెస్ అవగా.. మరికొందరు మాత్రం అర్థాంతరంగా కెరీర్‌లను ముగించుకున్నారు. అయితే, ఇంకొందరు టాలీవుడ్ హీరోలనే పెళ్లాడి ఇక్కడే సెటిల్ అయిపోయారు. అలాంటి వారిలో మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఒకరు. తనదైన అందంతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ఇప్పుడు భర్తకు సపోర్టుగా నిలుస్తోంది. తద్వారా అస్సలు తీరిక లేకుండా గడుపుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా నమ్రత శిరోద్కర్ పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దానిపై మీరూ లుక్కేయండి మరి!
అందంతో గెలిచి సినిమాల్లోకి:మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన నమ్రత శిరోద్కర్ 1993లో జరిగిన అందాల పోటీల్లో 'మిస్ ఇండియా యూనివర్స్', 'మిస్ ఇండియా ఏషియా పసిపిక్' కిరీటాలను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో 1998 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది.

తెలుగులో స్టార్ హీరోలతోనూ:హిందీలో వరుస సినిమాలు చేస్తోన్న సమయంలోనే నమ్రత శిరోద్కర్.. మహేశ్ బాబు నటించిన 'వంశీ'తో తెలుగులోకి పరిచయం అయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'అంజీ' అనే సినిమానూ చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు దారుణమైన ఫలితాన్ని చూసింది. దీంతో ఆమె బ్రేక్ తీసుకుంది.
సూపర్ స్టార్‌తో లవ్ మ్యారేజ్:'వంశీ' మూవీ చేస్తోన్న సమయంలోనే మహేశ్‌తో నమ్రత ప్రేమలో పడింది. ఆ తర్వాత చాలా కాలం పాటు వీళ్లిద్దరూ సీక్రెట్‌గా లవ్ ట్రాకును సాగించారు. అలా దాదాపు నాలుగేళ్లు క్లోజ్‌గా తిరిగిన తర్వాత తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పారు. ఈ క్రమంలోనే 2005లో వీళ్లు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

మహేశ్ బాబుకు సపోర్టుగానే:వివాహం జరిగిన తర్వాత నమ్రత శిరోద్కర్ సినిమాకు బ్రేక్ ఇచ్చేసింది. అయితే, ఆ తర్వాత సినీ రంగంలో యాక్టివ్ అయిన ఆమె.. మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది. డేట్స్, స్టోరీ డిస్కర్షన్స్, స్టైల్స్, యాడ్స్, బిజినెస్ ఇలా అన్నింటిలోనూ తన మార్క్ చూపిస్తోంది. ముఖ్యంగా మహేశ్ బాబు బ్యానర్‌పై వచ్చే చిత్రాలు నిర్మిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్:చాలా కాలం పాటు మోడల్‌గా, తర్వాత హీరోయిన్‌గా హవాను చూపించినా.. ఈ మధ్య కాలంలో తెరపై కనిపించకున్నా.. నమ్రత మాత్రం సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ భామ.. తరచూ తన వ్యక్తిగత, మహేశ్ మూవీలకు సంబంధించిన ఎన్నో విషయంలను ఫాలోవర్లతో పంచుకుంటూ వాళ్లను ఖుషీ చేసేస్తోంది.
నమ్రత వీడియో వైరల్‌గా:ఒకప్పటి గ్రేట్ మోడల్ నమ్రత శిరోద్కర్‌కు స్విమ్‌సూట్‌లో ఉన్న వీడియోను missdivaorg అనే సంస్థ తమ అధికారిక ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. మిస్ ఇండియా యూనివర్శ్ పోటీలో స్విమ్‌సూట్ రౌండ్‌లో నమ్రత ఇలా కనిపించినట్లు ఆ పోస్టులో వెల్లడించింది. దీంతో ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











