పెళ్లికి ముందే మహేశ్ అలా.. సితార అనుకోకుండా పుట్టింది: నమ్రత షాకింగ్ కామెంట్స్
చాలా సినిమా ఇండస్ట్రీల్లో ప్రేమ వ్యవహారాలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. అలాంటివి ఎన్నో ఉన్నప్పటికీ.. లవ్ మ్యారేజ్‌లు మాత్రం కొన్నే జరుగుతున్నాయి. అలా ఇప్పటికే ఎంతో మంది జంటలుగా మారిపోయారు. అందులో టాలీవుడ్ కపుల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ ఒకరు. చాలా కాలం వీళ్లిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి అతడికి అన్నీ తానై వ్యవహరిస్తూనే.. పిల్లలను కూడా చూసుకుంటోంది నమ్రత. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఈ మాజీ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళ్తే....
మిస్ ఇండియా.. సినిమాల్లో
నమ్రత శిరోద్కర్ మోడల్‌గా ప్రయాణం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే 1993లో జరిగిన అందాల పోటీల్లో 'మిస్ ఇండియా యూనివర్స్', 'మిస్ ఇండియా ఏషియా పసిపిక్' కిరీటాలను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో 1998 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో
బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్నప్పుడే నమ్రత శిరోద్కర్.. మహేశ్ బాబు హీరోగా చేసిన 'వంశీ'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'అంజీ' అనే సినిమాలోనూ నటించింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. దీంతో నమ్రత సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది.
మహేశ్‌తో ప్రేమ వివాహం
వాస్తవానికి 'వంశీ' మూవీ చేస్తోన్న సమయంలోనే మహేశ్ బాబుతో నమ్రత లవ్‌లో పడింది. ఆ తర్వాత చాలా కాలం పాటు వీళ్లిద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. అలా దాదాపు నాలుగేళ్లు క్లోజ్‌గా తిరిగిన తర్వాత పెద్దలకు చెప్పి ఒప్పించారు. ఈ క్రమంలోనే 2005లో వీళ్లు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంటకు ఇద్దరు పిల్లలు జన్మించారు.

భర్త, పిల్లలకు సపోర్టుగానే
పెళ్లి చేసుకున్న వెంటనే నమ్రత శిరోద్కర్ సినిమాకు బ్రేక్ ఇచ్చేసింది. అయితే, ఆ తర్వాత సినీ రంగంలో యాక్టివ్ అయిన ఆమె.. మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహిస్తోంది. అలాగే, పిల్లల బాగోగులు కూడా దగ్గరుండి చూసుకుంటోంది. ఇలా ఒక వైఫ్‌గా, ఒక మదర్‌గా తన పాత్రలను చక్కగా చేస్తూ ఎంతో మంది గృహిణులకు ఆదర్శంగా ఉంటోంది.
మహేశ్ ముందే చెప్పాడు
మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆమె తన రీఎంట్రీ గురించి మాట్లాడారు. 'నేను సినిమాల్లోకి వస్తున్నాన్న వార్తల్లో నిజం లేదు. నాకు ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదు. ఆఫర్లు అయితే చాలానే వస్తున్నాయి. కానీ, మహేశ్ పెళ్లికి ముందే తన భార్య ఏ వర్క్ చేయకుండా ఉండాలని నాతో చెప్పారు' అని వెల్లడించారు.

నమ్రత అలా పుట్టిందని
ఆ తర్వాత నమ్రత శిరోద్కర్ కంటిన్యూ చేస్తూ.. 'మహేశ్ బాబు పెళ్లికి ముందు చెప్పిన మాటకు కట్టుబడి ఉండే ఇంటికే పరిమితం అయ్యాను. అలానే సితార మాకు ప్లాన్ చేయకుండానే పుట్టేసింది. గౌతమ్‌ను అంతా అనుకునే కన్నాను. కానీ, సితార అలా కాదు. అయినా తనవల్ల ఎప్పుడూ సంతోషంగానే ఉన్నా. సితార మా ఇంటికి వెలుగులు తెచ్చింది' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











