తల్లి కాబోతున్న మహేష్‌ బాబు హీరోయిన్.. ప్రియుడితో ఏడేళ్లు డేటింగ్ తర్వాత

బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకొన్న హీరోయిన్ అమృతరావు త్వరలోనే తల్లి కాబోతున్నారు. తాను గర్భం దాల్చినట్టు ఆమె తన భర్త ఆర్జే అన్‌మోల్‌తో కలిసి అభిమానులతో పంచుకొన్నారు. మాతృత్వ అనుభూతిని పంచుకోబోతున్న సమయంలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ క్రమంలొ అమృతరావు వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం గురించి మరింతగా...

అందాల భామ అమృతరావు కెరీర్

అందాల భామ అమృతరావు కెరీర్

బాలీవుడ్ నటుడు అర్య బబ్బర్ నటించిన అబ్ కే బరస్ అనే చిత్రం ద్వారా 2002లో హిందీ చిత్ర సీమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత షారుక్ ఖాన్‌తో మై హూ నాలో నటించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత షికార్, వివాహ్, హే బేబి, లైఫ్ పార్ట్‌నర్, జాలీ ఎల్ఎల్‌బీ తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన అతిథి చిత్రంలో నటించారు. ఆ తర్వాత తెలుగు సినిమాలో కంటే హిందీలో ఆఫర్లు రావడంతో బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. చివరిసారిగా థాకరే చిత్రంలో కనిపించారు.

ఏడేళ్లపాటు ప్రియుడితో డేటింగ్

ఏడేళ్లపాటు ప్రియుడితో డేటింగ్

బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే అన్‌మోల్‌తో ప్రేమలో పడింది.తన ప్రియుడితో అమృతరావు ఏడేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత 2016‌లో నిరాడంబరంగా జరిగిన వేడుకలో ఇద్దరు ఒక్కటయ్యారు. అయితే చాలా కాలం అమృతరావు తన పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు. తాజాగా ఆమె తన పెళ్లి విషయంతోపాటు ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపెట్టారు.

ప్రైవేట్ హాస్పిటల్‌లో గర్భంతో

ప్రైవేట్ హాస్పిటల్‌లో గర్భంతో

ఇటీవల తన భర్త అన్‌మోల్‌తోపాటు ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు అమృత గర్భంతో ఉండటం మీడియా కంటపడింది. అప్పటి నుంచి ఆమె గర్బవతి అనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. ఈ వార్తలు వైరల్ అవుతుండటంతో ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టక తప్పలేదు. ఆ వార్తలకు బలం చేకూరే విధంగా తను తల్లి కాబోతున్నాననే విషయాన్ని అధికారికంగా మీడియాకు వివరించారు.

తల్లిని కాబోతున్నాన్నంటూ రివీల్ చేసి

తల్లిని కాబోతున్నాన్నంటూ రివీల్ చేసి

తాను తల్లి కాబోతున్న విషయంపై అమృతరావు జాతీయ దిన పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్‌మోల్‌తో ఏడేళ్ల రిలేషన్‌షిప్ చాలా బాగుంది. ఆయన లాంటి జీవిత భాగస్వామి దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా జీవిత ప్రయాణం అద్భుతంగా సాగుతున్నది అని అమృతరావు పేర్కొన్నారు.

పెళ్లి, ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎందుకు సీక్రెట్‌గా ఉంచానంటే..

పెళ్లి, ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎందుకు సీక్రెట్‌గా ఉంచానంటే..

పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడంపై అమృతరావు స్పందిస్తూ.. మా వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచాలని అనుకొన్నాం. మా రిలేషన్ షిష్ మొదలైన సమయంలో చాలా భయంగా ఉండేది. ఇతరలకు తెలిస్తే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకొంటాయనే విషయంపై ఆందోళనగా ఉండేది. అందుకే ప్రేమ, పెళ్లి విషయాలను సీక్రెట్‌గా ఉంచాం అని అమృతరావు చెప్పారు.

Recommended Video

Birthday Wishes For The Bollywood Legend From Tollywood Stars
అమృతరావుకు అభిమానులు విషెస్

అమృతరావుకు అభిమానులు విషెస్

అయితే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అలా చెప్పింది కానీ.. ప్రస్తుతం ఎన్ని నెలలు, డెలివరీ డేట్ ఎప్పుడనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. అమృతరావు తల్లి కాబోతున్నారనే విషయం బయటకు రాగానే తన స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు విషెస్ అందజేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X