Chandramukhi 2 జాక్‌పాట్ సినిమా..అలా కాపీ కొట్టేశాను.. మహిమ నంబియార్
మహిమా నంబియార్ ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్‌గా మారిపోయారు. మలయాళంలో ఆమె నటించిన వలెట్టా, ఆర్డీక్స్ సినిమాలు భారీ హిట్స్‌ను అందుకొన్నాయి. రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఆమె నటించిన చంద్రముఖి సినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఫిల్మీబీట్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మహిమా నంబియార్ మాట్లాడుతూ..
చంద్రముఖి మూవీ రిలీజైనప్పుడు:చంద్రముఖి 2 సినిమా ఆఫర్ నాకు జాక్‌పాట్ లాంటింది. చంద్రముఖి సినిమా వచ్చినప్పుడు నేను స్కూల్‌లో చదువుతున్నాను. ఆ సినిమాను నా ఫ్యామిలీతో చూసినప్పుడు.. చంద్రముఖి సీక్వెల్‌లో నటిస్తానని అనుకోలేదు. చంద్రముఖి 2 సినిమా కోసం నన్ను అడిగినప్పుడు ఆశ్చర్యపోయాను. నోట మాటలు రాలేదు. సినీ లెజెండ్ పీ వాసు గారే నాకు ఆఫరిస్తున్నారా? అనే షాక్‌లో ఉండిపోయాను అని మహిమా నంబియార్ తెలిపారు.
లారెన్స్ రాఘవతో వర్క్ చేయడం:చంద్రముఖి 2 సినిమాలో పీ వాసు లాంటి గొప్ప డైరెక్టర్‌తో పనిచేయడం హ్యాపీగా ఉంది. అలాగే లైకా లాంటి ప్రొడక్షన్‌లో పనిచేయడం ఇంకా హ్యాపీగా ఉంది. టాలెంటెడ్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గారితో వర్క్ చేసిన అనుభూతి మాటల్లో చెప్పలేను. ఇలాంటి అవకాశాలు అన్నీ రైట్ టైమ్‌లో వచ్చాయి. అందుకే నేను చంద్రముఖి 2 సినిమా నాకు జాక్‌పాట్ అని అన్నాను అని మహిమా నంబియార్ చెప్పారు.

మలయాళంలో రెండు హిట్స్:ఇక మలయాళంలో నేను నటించిన వాలెట్టా, అలాగే ఆర్డీఎక్స్ (RDX) సినిమాల విజయం నాకు చాలా హ్యాపీని ఇచ్చాయి. అయితే నటిగా నేను ఏదీ ప్లాన్ చేయలేదు. ఐదేళ్లలో నేను ఆ స్థాయిలో ఉండాలని అనుకోలేదు. సినిమా అవకాశాలు అలా వచ్చాయి. నేను మనసుపెట్టి సినిమాలు చేశాను.ఓ కీలకమైన పాత్రలో నన్ను సెలెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అని మహిమ నంబియార్ తెలిపారు.

పీ వాసు గారిని చూసి కాపీ కొట్టా:చంద్రముఖి సినిమాలోని పాత్ర కోసం నేను ఎలాంటి ప్రిపరేషన్ చేయలేదు. పీ వాసు లాంటి లెజెండ్ డైరెక్టర్ ఎలా చేయమంటే అలా చేశాను. పీ వాసును అలా ఫాలో అవుతూ వెళ్లిపోయాను. ఈ సినిమాలో అందరూ సీనియర్ యాక్టర్లు నటించారు. నేను ఒక్కదానినే కొత్తగా ఉన్నాను. అప్పుడు నేను సెట్‌లో భయం భయంగా అడుగుపెట్టాను. దర్శకుడు పీ వాసు ప్రతీ సీన్‌ను యాక్ట్ చేసి చూపించారు. కేవలం ఆయన ఏం చేశారో నేను అది కాపీ చేశాను. అలా నేను సెట్లో చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉన్నాను అని మహిమా నంబియార్ చెప్పారు.

800 మూవీలో మహిమ:ఇదిలా ఉండగా, మహిమా నంబియార్ నటించిన చంద్రముఖి 2 సినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అవుతుండగా, ఆమె నటించిన మరో సినిమా 800 అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ కానున్నది. ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా 800 మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో ముత్తయ్య మురళీధరన్ భార్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసగా నాలుగు భారీ సినిమాల్లో నటించిన మహిమ నంబియార్ టాలెంట్ గురించి ఇండస్ట్రీలో పలువురు గట్టిగానే చర్చించుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











