For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నచ్చకపోతే మూసుకోండి.. లేదా మలిచిపెట్టుకోండి.. కన్నుకొట్టి కవ్వించిన బికినీ క్వీన్

  |

  బాలీవుడ్ అందాల తార మలైకా అరోరాకు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బెడద ఎక్కువగానే కనిపిస్తున్నది. నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తుంటే మీకేం బాధ అంటూ పలుసార్లు ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బీచుల్లో ప్రియుడు అర్జున్ కపూర్‌తో బికినీలో దర్శనమివ్వడంపై నెటిజన్లు నోరుపారేసుకొన్న సంగతి తెలిసిందే. తాజా బికినీలో ఉన్న తన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసి ఘాటుగా స్పందించింది. ఇంతకు ఆమె చేసిన కామెంట్లు ఏమిటంటే..

  వింక్ ఉమెన్‌గా మలైకా అరోరా

  వింక్ ఉమెన్‌గా మలైకా అరోరా

  మలైకా అరోరా పోస్టు చేసిన ఫోటోను బట్టి చూస్తే నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. బికినీలో బీచ్ క్వీన్ అందంగా చిరునవ్వుతో కన్నుకొడుతూ ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సంతోషంగా ఉండటం నా ఛాయిస్. ఎప్పుడూ హ్యాపీగా ఉండేందుకు నేను ఇష్టపడుతాను అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

  నచ్చకపోతే మూసుకోండి

  నచ్చకపోతే మూసుకోండి

  నా ముఖంపై సంతోషం కనిపిస్తూనే అందంగా ఉంటాను. అందుకు నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను. మీకు నచ్చకపోతే మూసుకొని కూర్చొండి. మీ నెగిటివిటి మీరే మలిచిపెట్టుకొండి. మీరు చెత్త కామెంట్లకు దూరంగా ఉండండి అంటూ మలైకా ఘాటుగా స్పందించారు. #notinterested", "#toobusybeinghappy", "#notimefornegativity", "#tuesdaythoughts" "#43nhappy." అనే ట్యాగ్స్‌తో విజృంభించింది.

  మలైకా బ్యాచ్‌లర్ పార్టీ

  మలైకా బ్యాచ్‌లర్ పార్టీ

  రెండో పెళ్లి వార్త జోరందుకొన్న నేపథ్యంలో ప్రియుడు అర్జున్ కపూర్‌, ఇతర స్నేహితులతో కలిసి మాల్దీవుల పర్యటనకు వెళ్లింది. తన స్నేహితురాళ్లకు బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. బ్యాచ్‌లర్ పార్టీలో స్నేహితులతో బికినీలో ఆమె చేసిన సందడి నెటిజన్ల చేతికి పనిపెట్టేలా చేసింది. అయినా డోంట్ కేర్ అన్నట్టు మలైకా వింక్ అవతారం ఎత్తి పోస్టు పెట్టడం ఆసక్తిగా మారింది.

   మాల్దీవుల్లో అర్జున్‌ కపూర్‌తో

  మాల్దీవుల్లో అర్జున్‌ కపూర్‌తో

  మాల్దీవుల్లో అర్జున్ కపూర్‌తో హాటుహాటుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సముద్ర తీరంలో స్నేహితులతో జలకాలాడుతూ మలైకా సందడి అభిమానుల్లో జోష్ పెంచింది. సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియా ఫ్లాట్‌ఫాంల్లో వైరల్ అయ్యాయి. ఆ సందర్భంగా మలైకాను దారుణంగా ట్రోల్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ట్రోల్స్‌ను దృష్టిలో పెట్టుకొని తాజా పోస్టు పెట్టి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

  ఏప్రిల్ 19న వివాహం

  ఏప్రిల్ 19న వివాహం

  భర్త అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో మలైకా డేటింగ్ చేస్తున్నది. దాంతో ఏప్రిల్‌ 19 తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. క్రిస్టియన్ మతాచారం ప్రకారం చర్చిలో వివాహం జరుగనున్నట్టు సమాచారం. తమ పెళ్లికి జోరుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.

  English summary
  Malaika Arora is often trolled for her relationship with a much younger Arjun Kapoor, especially after rumour mills began churning that the duo is all set to tie the knot this April 19th in a Church wedding. Known not to mince her words, Malaika had the perfect response for haters and those who spew negativity.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more