ఫారిన్ క్రికెటర్‌తో ఎఫైర్? మాజీ ప్రియుడికి అలాంటి మెసేజ్.. 51 ఏళ్ల వయసులో హీరోయిన్ జోరు
50 ప్లస్‌లోనూ ఎఫైర్స్, బ్రేకప్స్, ప్రేమాయణాలతో వార్తల్లో నిలుస్తున్నారు బాలీవుడు ముదురు భామ మలైకా అరోరా. ఈమె ఎప్పుడు ఎవరితో డేటింగ్ చేస్తారో? ఎవరితో బ్రేకప్ చెబుతారో? అని సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, మీడియా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. 50 ఏళ్ల వయసులోనూ ఇప్పటికే చెక్కు చెదరని అందంతో మెరిసిపోయే మలైకా.. ఎఫైర్స్ విషయంలో పాతికేళ్ల అమ్మాయిని మించి దూసుకెళ్తున్నారు. తాజాగా మలైకా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ వివరాల్లోకి వెళితే..
చయ్యా చయ్యా సాంగ్‌తో క్రేజ్
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి ఛల్ చయ్యా చయ్యా అనే పాటతో 90వ దశకంలో భారతీయ చిత్ర పరిశ్రమను ఒక ఊపారు మలైకా అరోరా. అప్పట్లో స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. హిందీ ఇండస్ట్రీలో ఏ హీరో స్పెషల్ సాంగ్ చేయాలన్నా? ఖచ్చితంగా ఆ సినిమాలో మలైకా ఉండాల్సిందే అన్నట్లుగా తన ప్రతిభ చాటుకుంది. మన తెలుగులోనూ 2007లో మహేశ్ బాబు నటించిన అతిథిలో స్టెప్పులు వేశారు మలైకా అరోరా. దబాంగ్‌లో మున్నీ బద్నాం .. గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక.. సాంగ్స్‌తో తనలో ఏమాత్రం వాడి తగ్గలేదని నిరూపించుకున్నారు మలైకా. సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, ఆమె దూసుకెళ్తున్నారు. సినిమాల కంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటారు ఈ హీరోయిన్.

అర్బాజ్ ఖాన్‌తో విడాకులు
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లి చేసుకున్నారు మలైకా అరోరా. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. హిందీ పరిశ్రమలో స్టార్ కపుల్‌గా ఈ జంట పాపులరైంది. అయితే దాదాపు 20 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతూ మలైకా - అర్భాజ్‌లు విడాకులు తీసుకోవడం బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. విడాకుల తర్వాత ఒంటరిగా ఉండలేకపోయిన అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌తో ప్రేమలో పడి రెండేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యే సమయానికి అర్భాజ్ ఖాన్ వయసు 55 ఏళ్లు కాగా.. ఆమెకు 33. ఇటీవలే తన భార్య గర్భం దాల్చినట్లు షాకిచ్చారు సల్మాన్ సోదరుడు. లేటు వయసులో రెండోసారి తండ్రి కాబోతుండటంతో అర్బాజ్ చాలా హ్యాపీగా ఉన్నారు.
అర్జున్ కపూర్‌తో డేటింగ్, బ్రేకప్
మరోవైపు మలైకా అరోరా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన యువ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసి ఇండస్ట్రీకి షాకిచ్చింది. కానీ అతనితోనూ బంధాన్ని కంటిన్యూ చేయలేక కొద్దిరోజులకే బ్రేకప్ చెప్పేసింది మలైకా. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025)లో రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరతో కనిపించి బాంబు పేల్చింది మలైకా. రాజస్థాన్ జెర్సీలు ధరించిన వీరిద్దరూ మీడియా కంటికి చిక్కారు. మలైకా ఇప్పుడు ఈ స్టార్ క్రికెటర్‌తో ప్రేమాయణం నడుపుతోందా? లేక మ్యాచ్ కోసం ఇద్దరూ కలిశారా? అన్నది క్లారిటీ రాలేదు.
మాజీ ప్రియుడికి విషెస్
అర్జున్ కపూర్‌తో బ్రేకప్ జరిగిన ఇన్నేళ్ల తర్వాత మలైకా అరోరా మరోసారి తన మాజీ ప్రయుడితో టచ్‌లోకి వెళ్లారు. ఈ రోజు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అర్జున్ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఈ విషయం కాస్తా బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మరోసారి అర్జున్ కపూర్‌ను మలైకా అరోరా దువ్వుతోందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయనతో ఉన్న పాత సాన్నిహిత్యంతోనే మలైకా విష్ చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











