ప్యాంట్ వేసుకోవడం మరచిపోయి రోడ్డెక్కిన మలైకా.. మాములుగా ఆడుకోవడం లేదుగా!
యాభై ఏళ్లకు దగ్గరపడుతున్న మలైకా అరోరా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అందం ఆరబోస్తూ ఉంటుంది. అంతేకాక ఫిట్నెస్ విషయంలో కూడా కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. అయితే ఆమె వేసుకునే డ్రెస్సులు కారణంగా ఆమె ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తన కంటే చిన్న వయసు హీరో అర్జున్ కపూర్‌తో ఆమె సహజీవనం చేస్తున్న ఈ భామ ఈ మధ్య బ్రేకప్ చెప్పిందని కూడా ప్రచారం జరిగినా దానిని ఖండించింది. ఇప్పుడు ఆమె వేసుకున్న షర్ట్ కారణంగా మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఆ వివరాలు
Recommended Video

ఈసారి కూడా
మలైకా అరోరా స్టైల్ క్వీన్. ఆమె తన గ్లామరస్ మరియు కూల్ లుక్‌తో ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉంటుంది. డీప్ నెక్‌లైన్, బోల్డ్ షార్ట్ మరియు టైట్స్ ధరించి, ఆమె కెమెరా ముందుకు వచ్చినప్పుడల్లా, ఆమె ఫ్యాషన్ సెన్స్ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు. అదే సమయంలో, చాలా సార్లు ఆమె డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేస్తారు. ఈసారి కూడా అలాంటిదే జరిగింది.

బాటమ్ వేర్ ధరించలేదు
ఆమె చాలా పొట్టి బట్టలతో ఇంటి బయట కనిపించింది. ఫోటో గ్రాఫర్లు కెమెరాలో బంధించిన మలైకా అరోరా యొక్క ఫోటో మరియు వీడియో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఇందులో ఆమె పెద్ద సైజ్ వైట్ షర్ట్‌తో పాటు ఓవర్‌సైజ్ టాన్ బ్రౌన్ కలర్ స్వెటర్‌ను ధరించి కనిపించింది. అదే సమయంలో, మలైకా ఈ లుక్‌లో బాటమ్ వేర్ ధరించలేదు. ఆమె బోల్డ్ ఓవర్‌సైజ్ స్వెటర్‌తో పాయింటెడ్ హీల్స్ ధరించి కనిపించింది.

గొప్ప డ్యాన్సర్ కూడా
అలా ఆమె ముంబైలోని ఖర్ ప్రాంతానికి వచ్చారు. ఆమె కారు దిగి నడుస్తుంటే ఎప్పుడూ కాచుకు కూర్చునే కెమెరాలు ఆమె ఫోటోలు తీశాయి.వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆమె ప్యాంటు వేసుకోలేదని, నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 'ప్యాంటు ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చావా' అంటూ ఒకరు ఆమె ఏదో ధరించడం మర్చిపోయినట్లు కనిపిస్తోంది, ఆమె స్టైల్ శైలి అసంపూర్ణంగా కనిపిస్తుందని మరొకరు కామెంట్ చేశారు.

గొప్ప డ్యాన్సర్ కూడా
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన లుక్స్ కోసం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె జిమ్ మరియు పార్టీ లుక్స్ గురించి ఎప్పటికప్పుడు చర్చలోకి వస్తూ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ మలైకాకు 48 ఏళ్లు అయినప్పటికీ ఆమె స్టైల్ మరియు ఫిట్‌నెస్ ప్రజలలో చర్చనీయాంశం అయ్యేట్టు చేస్తూ ఉంటుంది. మలైకా 1973 అక్టోబర్ 23న జన్మించింది. మలైకా నటి మాత్రమె కాదు గొప్ప డ్యాన్సర్ కూడా.ఆమె యోగా సాధకురాలు కూడా.

తరచుగా కలిసి
ఎప్పటికప్పుడు తన ఫోటోలను, యోగాసనాలను, వ్యక్తిగత విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న మలైకా దాదాపు 18 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చింది. వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో రిలేషన్ లో ఉంది. ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తుంటారు.


Click it and Unblock the Notifications











