Malaika Arora health update: కంటికి గాయాలు.. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే?
బాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ భామ మలైకా అరోరా ప్రమాదానికి గురైందన్న వార్త తెరపైకి రావడంతో లక్షలాది మంది అభిమానులు టెన్షన్ లో మునిగిపోయారు. ఖోపోలి ఎక్స్‌ప్రెస్‌వేపై మలైకా కారు ప్రమాదానికి గురైంది, ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమె కంటికి గాయాలు కావడంతో ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయం మీద అందరిలో ఆందోళన నెలకొంది. అయితే ఆమె ఆరోగ్యం గురించి తాజా విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు

ఢీ కొట్టుకుంటూ వచ్చి
ప్రస్తుతానికి సినిమాలు చేతిలో లేకున్నప్పటికీ రియాలిటీ షోలు చేస్తూ మలైకా అరోరా బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే శనివారం ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో రెండు కార్లు ఒకదానిని ఒకటి ఢీ కొట్టుకుంటూ వచ్చి మలైకా ప్రయాణిస్తున్న వాహనానికి బలంగా తాకాయి.

CT స్కాన్ పరీక్షలు
ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆమెతో పాటు డ్రైవర్, ఓ బాడీ గార్డ్ ఉండగా ఆమెతో పాటు వారికి కూడా గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయిపోయింది. గాయపడిన మలైకాను వెంటనే ముంబైలోని అపోలో ఆసుపత్రికి తరలించగా ప్రమాదంలో మలైకా నుదిటిపై కంటి దగ్గర చిన్న గాయాలయ్యాయి. దీంతో ఆమెకు CT స్కాన్ పరీక్షలు నిర్వహించారు.

డిశ్చార్జ్ అయ్యి
ఆసుపత్రిలో మలైకా అరోరా CT స్కాన్ చేయగా ఆ రిపోర్ట్ ప్రాకారము ఎలాంటి భయం లేదని చెప్పారు. ఐయితే ముందు జాగ్రత్తగా నటిని రాత్రిపూట ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. తాజా నివేదిక ప్రకారం, మలైకా ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి తన ఇంటికి చేరుకుంది. ఇంతకుముందు, మలైకా సోదరి అమృతా అరోరా కూడా నటి ఆరోగ్య అప్‌డేట్ ఇచ్చి, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.

కంటి పైన కుట్లు
మలైకా అరోరా సన్నిహితురాలు ఒకరు ఒక జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ మలైకా అరోరాకు కుట్లు పడ్డాయని, ప్రస్తుతం ఆమె బాగానే ఉందని చెప్పారు. అయితే ఈ ప్రమాదంతో మలైకా అరోరా కాస్త షాక్‌కి గురయ్యారు. ఇప్పుడు ఆమె బాగానే ఉన్నారని ఆమె తలకు పెద్దగా గాయం కాలేదని అంటున్నారు. మలైకా అరోరాకు ప్రమాదం జరిగినప్పుడు, ఆమె తన రేంజ్ రోవర్ వాహనంలో ఉన్నారు. ఆ కారు రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

పర్సనల్ విషయాలకు వస్తే
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా అరోరా కొన్నేళ్ల క్రితమే విడాకులు కూడా తీసుకుంది. ఆ తర్వాత ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. అయితే ఈ మధ్య వీరు కూడా విడిపోతున్నారని ప్రచారం జరిగినా అదేమీ లేదని ఈ జంట తేల్చి చెప్పింది. ఇక తన సంతానం కోసం అర్భాజ్ ఖాన్ తో అడపాదడపా ఆమె కలిసి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె డిశ్చార్జ్ అయిన విషయం తెలిసి అభిమానులు ఊపిరి పీల్చు కుంటున్నారు.


Click it and Unblock the Notifications











