నా ముఖం అలా మారడానికి కారణం.. మానసికంగా, శారీరకంగా: మలైకా అరోరా
బాలీవుడ్ మీడియాలో మలైకా అరోరా హంగామా అంతా ఇంతా కాదు.. కొత్త ప్రియుడు అర్జున్ కపూర్‌తో విదేశీ విహార యాత్రల చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. జిమ్‌లో కసరత్తులు చేయడం దగ్గర నుంచి ప్రతీ విషయాన్ని తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకొంటుంటారు. ఇలా కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్న మలైకా తాజాగా బాలీవుడ్ మీడియాతో తన మనోభావాలను పంచుకొన్నారు.
మీ ముఖంలో కొత్త కాంతికి కారణమేమిటనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఇప్పుడు నా జీవితంలో సంతోషం వెల్లివిరుస్తున్నది. కొంత సాహవాసం, మానసిక, శారీరక, ఎమోషనల్‌గా ప్రశాంతత లభిస్తున్నది. అందుకే నా ముఖంగా బాగా వెలిగిపోతున్నది అని మలైకా అరోరా అన్నారు.
అంతేకాకుండా నిత్యం నేను యోగా, మెడిటేషన్ చేస్తుంటాను. అవి నాకు, నా జీవితానికి మంచి మార్గదర్శకంగా మారాయి. నా వ్యక్తిగత, ఫ్రొఫెషనల్ జీవితంలో చోటుచేసుకొన్న మార్పులు నాకు మంచి ఆనందాన్ని పంచుతున్నాయి. ఇంట బయట నాకు ఎదురవుతున్న విషయాలు సానుకూలంగా ఉన్నాయి అని మలైకా అరోరా పేర్కొన్నారు.

18 ఏళ్ల క్రితం సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లాడిన మలైకా అరోరా ఇటీవల విడాకులు తీసుకొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల మేము విడిపోయినప్పటికీ.. స్నేహితులగా ఉంటున్నామని అన్నారు. ఇటీవల అర్జున్ కపూర్ 34వ జన్మదినం సందర్భంగా తమ మధ్య ఉన్న బంధాన్ని ధృవీకరించారు. తన జన్మదినాన్ని మలైకాతో కలిసి అమెరికాలోని న్యూయార్క్‌లో అర్జున్ కపూర్ ఘనంగా జరుపుకొన్నాడు.
గత కొద్దికాలంగా అర్జున్ కపూర్, మలైకా అరోరా కలిసి తిరగడం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకొన్నాయి. అయితే వాటిపై మాట్లాడటానికి నిరాకరించిన మలైకా.. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు.


Click it and Unblock the Notifications











