నన్ను అలా పిలిస్తే... చెంప పగుల కొడతా.. మలైకా అరోరా ఫైర్
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా నటిగా కంటే.. ఐటమ్ నంబర్‌గానే ఎక్కువగా గుర్తింపు ఉంది. దిల్ సే చిత్రంలో చయ్యా.. చయ్యా.. మున్నీ బద్నాం హుయీ, తెలుగులో కెవ్వుకేక పాటలతో మంచి ఐటెమ్ డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే ఇటీవల తనను ఐటెహ్ నంబర్‌గా పిలువడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇటీవల బాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నారంటే..

స్పెషల్ సాంగ్స్‌ను ఐటెమ్‌గా
నేను సినిమాల్లో చేసే స్పెషల్ సాంగ్స్‌ను ఐటెమ్ సాంగ్స్‌గా వ్యవహరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఐటెం అంటే ఏమిటి? మేమైనా వస్తువులమా?.. ఇక నుంచి ఎవరైనా నన్ను ఐటెం అంటే చెంప పగులగొడుతాను అని మలైకా అరోరా హెచ్చరించారు.

నా ఇష్టప్రకారమే చేస్తాను
నేను ఏదైనా స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తే నా ఇష్ట్ర ప్రకారమే జరుగుతుంది. నాకు సౌకర్యంగా ఉంటేనే నేను నటిస్తాను. అంతేకానీ ఏదో ఒత్తిడిల మధ్య అలాంటి పాటల్లో నటించలేను. నాకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే నా అభిప్రాయాన్ని వెల్లడిస్తాను. నేను వేసే స్టెప్పులు అసభ్యకరంగా ఉంటే నేను వ్యతిరేకిస్తాను, నన్ను వస్తువులాగా చూపించడానికి ప్రయత్నిస్తే వ్యతిరేకిస్తాను అని మలైకా అరోరా అన్నారు.

నాకు అసౌకర్యంగా ఉంటే
నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా నటించలేదు. అసభ్యకరంగా నేను తెరపైన నటించడానికి ఇష్టపడలేదు. నాకు సౌకర్యంగా, నాకు ఆనందం కలిగించే స్పెషల్ సాంగ్స్‌లో నటించాను. అదీ నాకు ఇష్టమైతేనే నేను అందులో కనిపిస్తాను అని మలైకా అరోరా తెలిపారు.

నేను డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ వచ్చా
నాది విభిన్నమైన ఆలోచనలతో కూడిన జీవితం. నేను ప్రత్యేకమైన బ్యాక్‌గ్రౌండ్‌తో నేను వచ్చాను. మహిళగా నాకు ఇది నష్టం కలిగిస్తుందంటే దానిని నిరభ్యంతరంగా ఖండిస్తాను. నా కుటుంబ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించను అని మలైకా చెప్పారు.

అర్జున్ కపూర్‌తో మ్యారేజ్
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత ప్రస్తుతం బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నది. ఇటీవల కాలంలో వారిద్దరూ మీడియాలో ప్రముఖంగా మారారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్టు వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే వీరిద్దరూ తమ పెళ్లిపై మీడియా ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారు.


Click it and Unblock the Notifications











