ప్రియురాలితో స్విమ్మింగ్ పూల్‌లో అర్జున్ కపూర్.. మలైకా అరోరా ఏం చేసిందో తెలుసా?
ప్రస్తుతం బాలీవుడ్ హాట్ లవర్స్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మలైకా అరోరా, అర్జున్ కపూర్. తన కంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకాతో యంగ్ హీరో అర్జున్ జత కట్టాడు. చాలా రోజులు సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న వీరు కొద్ది కాలం క్రితం నుంచి తమ రిలేషన్ షిప్ గురించి బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టారు. పలుమార్లు కెమేరా కంటికి చిక్కారు. అప్పుడప్పుడు రొమాంటిక్ ఫొటోలను వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక అర్జున్ కపూర్‌తో కలిసి మలైకా నివసిస్తోంది.

48 ఏళ్ల మలైకా అందానికి ఫిదా
మలైకా అరోరా ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యోగా ట్రైనర్‌గా ఆమెకు ముంబైలో మంచి డిమాండ్ ఉంది. ఈ ఏజ్ బార్ ముద్దుగుమ్మ అందం ముందు ఏ కుర్ర హీరోయిన్ కూడా పనికిరాదంటే అతిశయోక్తి కాదు. 48 ఏళ్ల వయసులోనూ మలైకా పర్ఫెక్ట్ ఫిగర్‌ని మెయింటైన్ చేస్తూ సెగలు రేపుతోంది. ఇక ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ హాట్ ఫొటోలు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంటాయి. మలైకా అందానికి అర్జున్ మాత్రమే కాదు ఎంతో మంది ఫిదా అవుతున్నారు.

హాట్‌నెస్‌కు నో లిమిట్
48 ఏళ్ల వయసు, టీనేజ్‌లో ఉన్న కొడుకు ఉన్నా సరే హాట్‌గా కనిపించే విషయంలో మలైకా ఎక్కడా వెనక్కి తగ్గదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక, జిమ్ డ్రెస్‌లో మలైకా కనిపించే తీరు కుర్రకారులో సెగలు రేపుతుంటుంది. ఈ ఫొటోలపై వచ్చే నెగిటివ్ కామెంట్లను మలైకా అస్సలు పట్టించుకోదు. ఎంత మంది తనపై ట్రోలింగ్‌కు పాల్పడినా డోంట్ కేర్ అంటుంది. అసభ్యకర కామెంట్లు చేసినా రియాక్ట్ అవదు.

మలైకా రూట్‌లో అర్జున్
48 ఏళ్ల మలైకా స్ఫూర్తితో అర్జున్ కపూర్ కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. నిత్యం జిమ్‌లో చెమటోడుస్తూ కండల వీరుడిగా మారిపోయాడు. ప్రస్తుతం మోహిత్ సూరి రూపొందిస్తున్న `ఏక్ విలన్-2`లో అర్జున్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అర్జున్ సిక్స్‌ప్యాక్‌తో కనిపించబోతున్నాడు. తాజాగా అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఫొటోను షేర్ చేశాడు. అందులో షర్ట్‌లెస్‌గా ఉన్న అర్జున్ వీపు మాత్రమే కనిపిస్తోంది. దానికి క్యాప్షన్‌గా `మలైకా.. ఎట్టకేలకు నా బ్యాక్ చూడగలిగావు` అని రాసుకొచ్చాడు.

బ్రేకప్ రూమర్లకు చెక్
గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ విడిపోతున్నారంటూ ఆ మధ్య బాలీవుడ్ మీడియాలో వార్తలు ప్రారంభమయ్యాయి. మలైకాను వదిలేసి మరో యంగ్ హీరోయిన్‌కు అర్జున్ క్లోజ్ అయ్యాడని వార్తలు షికార్లు చేశాయి. అయితే వాటిపై నేరుగా స్పందించకుండా ఇద్దరూ పరోక్షంగా ఆ రూమర్లకు చెక్ పెట్టారు. తన ఫ్లాట్‌లో అర్జున్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి మలైకా ఆ రూమర్లకు తెరదించింది. అర్జున్ కూడా మలైకాతో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే పెళ్లిపై మాత్రం ఇద్దరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

వైరల్ అయిన హాట్ కామెంట్స్
ఫొటోల్లో, వీడియోల్లో హాట్‌గా కనిపించడమే కాదు.. మనసులో ఉన్నది ఉన్నట్టు బోల్డ్‌గా మాట్లాడడంలోనూ మలైకాను మించిన వారు లేరు. గతంలో `నో ఫిల్టర్ విత్ నేహ` కార్యక్రమానికి హాజరైన మలైకా తన బెడ్ రూమ్ సీక్రెట్స్ పంచుకొంది. మీకు శృంగారంలో ఇష్టమైన భంగిమ ఏది అంటే.. తడుముకోకుండా `ఆన్ టాప్ యాంగిల్` అని చెప్పేసింది. పురుషుడిపై స్త్రీ ఉండే భంగిమ తనకు చాలా ఇష్టమని, అక్కడ ఆడవారి డామినేషన్ ఉంటుందని తెలిపింది. అంతే కాకుండా తానెప్పుడు టాప్‌లోనే ఉంటానని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











