స్టేజ్ మీదే హీరోయిన్‌కు ముద్దులు: ఏకంగా ఇద్దరితో.. ఆమె రియాక్షన్ చూశారంటే!
సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు. కానీ, కొందరు మాత్రమే భారీ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ మలైకా అరోరా ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అదే సమయంలో విడాకులు, లవ్ ట్రాకులు, హాట్ షోతో మరింత హైలైట్ అవుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో మలైకా అరోరా మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఇందులో ఇద్దరు నిర్వహకులను మలైకా అడిగి మరీ ముద్దులు పెట్టించుకుంది. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

ఐటెం గర్ల్‌గా ఎనలేని గుర్తింపు
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే మలైకా అరోరా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్' వంటి ఐటెం సాంగ్స్ చేసి గుర్తింపు పొందింది. అలాగే, తెలుగులో 'అతిథి', 'గబ్బర్ సింగ్' మూవీల్లో స్పెషల్ సాంగ్స్‌తో రచ్చ చేసింది.

స్టార్ హీరో తమ్ముడితో బ్రేకప్
నటిగా, ఐటెం గర్ల్‌గా అప్పడప్పుడే ఎదుగుతోన్న టైంలోనే మలైకా అరోరా.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్ల పాటు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు. ఇక, 2017లో మలైకా అరోరా పర్సనల్ రీజన్స్‌తో అర్భాజ్‌కు విడాకులిచ్చింది. అప్పటి నుంచి కెరీర్ కంటిన్యూ చేస్తోంది.

ఆ హీరోతో మలైకా లవ్ ట్రాక్
భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో లవ్ ట్రాక్ నడుపుతోంది. మొదట్లో సీక్రెట్‌తో వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లలో రచ్చ చేయడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం.. ఒకే ఇంట్లో కలిసి ఉండడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

యాక్సిడెంట్ తర్వాత స్పీడ్
కొద్ది రోజుల క్రితం మలైకా అరోరా ఓ ఫ్యాషన్ షోకు వెళ్లొస్తోన్న సమయంలో యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో మలైకా అరోరా ప్రయాణిస్తోన్న కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయిపోయింది. దీంతో ఆమెకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక, చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మలైకా మరోసారి ముఖానికి మేకప్ వేసుకుని స్పీడు పెంచేసింది.

ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా
చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేసినా.. ఈ మధ్య వెండితెరపై అంతగా కనిపించకున్నా మలైకా అరోరా సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

ఫ్యాషన్ వీక్‌లో గ్లామర్ ట్రీట్
బోల్డు బ్యూటీ మలైకా అరోరా తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఇందులో ఈ అమ్మడు ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ వేసుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతేకాదు, అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఈ డ్రెస్‌లో మలైకా అరోరా ఎద అందాలు విపరీతంగా కనువిందు చేశాయి. అంతేకాదు, ఈ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ కూడా చేసి ఈ ముదురు భామ సందడి చేసింది.

ముద్దులు పెట్టించుకుంది
ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్న తర్వాత మలైకా అరోరా స్టేజ్‌పై మాట్లాడింది. అనంతరం నిర్వహకులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ సమయంలోనే తనకు అటు ఇటు పక్క ఉన్న ఇద్దరు వ్యక్తులను అడిగి మరీ ముద్దులు పెట్టించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అదే సమయంలో మలైకాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్స్ కూడా వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











