Malaika Arora: రెండో పెళ్లిపై మలైకా అప్డేట్.. ఆ ఫొటోతో ట్విస్ట్ ఇచ్చిందిగా!
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ మలైకా అరోరా తరచుగా డేటింగ్ కు సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఆమె పెళ్లికి సంబంధించిన రూమర్స్ అయితే రోజుకొకటి వైరల్ అవుతుంటాయి. బాలీవుడ్ యువ హీరోతో ఆమె ప్రేమలో ఉంది అని గత కొంతకాలంగా డేటింగ్ చేస్తుంది అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా అనేక రకాల కథనాలు వస్తుంటాయి. ఇక ఈ విషయంలో చెప్పి చెప్పినట్టుగా మలైకా అరోరా గత మూడేళ్ళ నుంచి ఊరిస్తూనే ఉంది. ఇక రీసెంట్ గా మలైకా అరోరా పోస్ట్ చేసిన ఒక ఫోటో ద్వారా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ అయితే ఇచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ రూట్లో సక్సెస్ కాలేదు
మోడల్ గా మంచి గుర్తింపును అందుకున్న తర్వాత మలైకా అరోరా చాలా తొందరగానే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందుకుంది. అయితే మొదట ఆమె హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని అనుకున్నప్పటికీ కూడా ఆ రూట్లో అయితే పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక స్పెషల్ సాంగ్స్ తోనే ఆమె ఎక్కువగా అవకాశాలు అందుకుంది.
అప్పట్లో బాలీవుడ్ బడా హీరోలందరితో ఆమె ఐటెమ్ సాంగ్స్ చేసింది. ఇక తెలుగులో గబ్బర్ సింగ్ లో కూడా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. మలైకా అరోరా స్పెషల్ సాంగ్ లు కనిపించింది అంటే ఒకప్పుడు ఆ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి బజ్ క్రియేట్ అయ్యేది.

మొదటి భర్త నుంచి విడాకులు
ఇక మలైకా అరోరా చాలా కాలం పాటు ప్రత్యేకమైన కమర్షియల్ యాడ్స్ తోనే ఎక్కువగా గుర్తింపు అందుకుంది. ఇక మోడల్గా అయితే కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ మంచి ఆదాయాన్ని కూడా అందుకుంది. ఇక మలైకా అరోరా బాలీవుడ్ సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్బాజ్ ఖాన్ ను మొదట పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక 2017లో వారు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

యువ హీరోతో డేటింగ్
ఇక మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత 2016 నుంచి మలైకా అరోరా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో కొనసాగుతోంది. ఇక అతను ఆమె కంటే వయసులో 10 ఏళ్లకు పైగా చిన్నవాడు అయినప్పటికీ కూడా డేటింగ్ చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. నిత్యం వీరికి సంబంధించిన ఫోటోలు కూడా బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంటాయి.
ఎంగేజ్మెంట్ అయ్యిందా?
అయితే వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా చాలా కాలంగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే గతంలో మాత్రం బ్రేకప్ చెప్పుకున్నట్లు కూడా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మలైకా అరోరా మరోసారి సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ రింగ్తో కనిపించినట్లుగా స్టిల్ ఇవ్వడం వైరల్ అవుతొంది. యస్ చెప్పాను అని కూడా ఆమె క్యాప్షన్ ఇవ్వడంతో త్వరలోనే అర్జున్ కపూర్ తో పెళ్లి జరగబోతున్నట్లుగా కూడా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరో క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











