twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీలో మలైకా అరోరా రచ్చ.. కవ్విస్తూ హీట్ పెంచేస్తోందిగా!

    |

    హీరోయిన్లు సినిమాల్లో పెద్దగా నటించకున్నా సోషల్ మీడియా పుణ్యమా అని వార్తల్లోనే నిలుస్తున్నారు. తమ పర్సనల్ విషయాల కంటే ఎక్కువగా అందాలను ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. అలాంటి వారిలో ముదురు భామ మలైకా అరోరా ముందు వరుసలూ ఉంటారు. చాలా కాలంగా గ్లామర్ ఫీల్డులో నెట్టుకొస్తున్న ఆమె సోషల్ మీడియాలో శృతి మించిన హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని ఘాటు బికినీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ఆ సంగతి ఏంటో చూద్దాం

    ఐటెం బాంబ్ గా

    ఐటెం బాంబ్ గా

    మోడలింగ్ లో మంచి బిజీగా ఉన్న సమయంలోనే మలైకా అరోరాకు కొన్ని సినిమాల్లో అవకాశం రావడంతో కాదనకుండా నటించింది. అయితే ఆమెకు ఆ సినిమాలు గుర్తింపు మాత్రం తీసుకు రాలేదు. అలా సినిమాల్లో నటిస్తూనే ఐటెం భామగా మారింది. ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌‌ చేసి బాలీవుడ్ ఐటెం బాంబ్ గా పేరు తెచ్చుకుంది.

    తొమ్మిదేళ్లు

    తొమ్మిదేళ్లు

    అలాగే ఆమె తెలుగులో మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్‌'లో స్పెషల్ సాంగ్స్‌ చేసి అందరికీ దగ్గరయింది. కెరీర్ పరంగా నిలబడుతున్న సమయంలో మలైకా అరోరా హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు బాగానే ఉన్నారు. వీరు ప్రేమకు గుర్తుగా ఒక బాబు కూడా పుట్టాడు. కానీ వ్యక్తిగత కారణాలతో మలైకా అరోరా అర్భాజ్‌ విడిపోయారు.

    క్లారిటీ లేదు

    క్లారిటీ లేదు

    ఈ 48 ఏళ్ల భామ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విడాకులు అనే వాదన కూడా ఉన్నా అవి వారి పర్సనల్ కాబట్టి బయటకు రాలేదు. ఇక త్వరలో అర్జున్ కపూర్ ఆమెను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయం మీద క్లారిటీ లేదు. ప్రస్తుతం సినిమాలు ఏవీ చేయకుండానే బుల్లితెర షోలతో పాటు ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు.

    పరిస్థితి ఏంటి

    పరిస్థితి ఏంటి

    తాజాగా మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బికినీ ధరించి వెనక్కి తిరిగి హాట్ ఫోజులో దర్శనమిచ్చింది. ఒక వైపు తిరిగిన బ్యాక్ నుంచి చూపిస్తే మలైకా తడిసిన అందాలు ఇలా రచ్చ చేస్తే అసలు పూర్తిగా తిరిగితే పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో మలైకా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    చివరిసారిగా

    చివరిసారిగా

    మలైకా అరోరా చివరిసారిగా 'ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్' అనే రియాల్టీ షోలో కనిపించింది. ఆమె న్యాయమూర్తి ప్యానెల్‌లో ఒకరిగా కనిపించింది. ఇక ప్రస్తుతానికి ఆమె కొంచెం రెస్ట్ మోడ్ లో ఉండనే చెప్పాలి. ఆ మధ్య యాక్సిడెంట్ అయ్యాక కొంచెం వర్క్ కు ఆమె దూరంగా ఉంటున్నారు.

    English summary
    Malaika Arora raises up Heat In A Black Bikini, she shared the photo in instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X