మలైకా అరోరా చేతికి నిశ్చితార్థం ఉంగరం.. పెళ్లికి ముందు అసలు గుట్టు అదే..
బాలీవుడ్ నటి మలైకా అరోరా మరోసారి సోషల్ మీడియాను వేడెక్కించింది. చేతికి ఉంగరం ధరించిన ఈ బ్యూటీ ఎంగేజ్‌మెంట్ జరిగిందా అనే విధంగా భారీ రూమర్లకు తెరలేపింది. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్ మీడియా అలర్ట్ అయింది. తమకు తోచిన విధంగా ఊహగానాలతో కథనాలు హోరెత్తిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నది. డేటింగ్, విహార యాత్రలు, పార్టీల పేరుతో ముంబై వీథులను, హోటళ్లను హీటెక్కించింది. ఈ నేపథ్యంలో అర్జున్ కపూర్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం మీడియాలో జోరుగా నానుతున్నది.

ఈ క్రమంలో మలైకా అరోరా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టి.. ఇలాంటి ఉంగరం ధరించడం నాకు ఓ డ్రీమ్. నేను ఎంతగా దీనిని ఇష్టపడుతానంటే.. ఆనందం ఇక్కడే మొదలైంది. మీ జీవితంలో ప్రేమను పొందాలంటే ఇలాంటి ఉంగరాన్ని ధరించాలి అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఈ తీరా చూస్తే మలైక అరోరా అసలు గుట్టు విప్పింది. ఓ జ్యువెల్లరీ బ్రాండ్ కోసం చేసిన ప్రమోషన్‌కు సంబంధించిన ఫోటో అని తేలిపోయింది.


Click it and Unblock the Notifications











