twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా నడుముకి తాడు కట్టి చేశారు.. తట్టుకోలేక పోయా.. మలైకా అరోరా

    |

    అప్పుడెప్పుడో బాలీవుడ్ మూవీ 'దిల్ సే'లో ''చలు ఛయ్య ఛయ్యా ఛయ్య'' అంటూ ప్రేక్షకులకు కొత్త మైకం పరిచయం చేసింది మలైకా అరోరా. 45 సంవత్సరాలు వచ్చినా నేటికీ తన అందాల్లో ఆవగింజంత మార్పు కూడా రానివ్వలేదు. లేలేతప్రాయం సొగసులతో సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండే ఈ భామ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఛయ్య ఛయ్యా సాంగ్ లో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.

    ఈ పాట షూటింగ్ చేస్తుండగా తాను చాలా తీవ్రంగా గాయపడ్డానని చెప్పింది మలైకా అరోరా. పాట మొత్తం రైలు పైనే షూటింగ్ చేయడం కారణంగా డాన్స్ చేస్తూ కొన్ని సార్లు పట్టుతప్పి పడిపోయానని పేర్కొంది. అలా జరగడం చూసి పడిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తన నడుముకి తాడు కట్టారని, ఆ తాడు కట్టుకునే డ్యాన్స్‌ చేశానని తెలిపింది. పాట షూట్‌ అంతా ఫినిష్ అయ్యాక తాడు విప్పుతుంటే నడుమంతా రక్తమే కనిపించిందని ఆమె చెప్పింది. తాడు తన నడుమును బాగా రాసుకు పోవడం చూసి సెట్లో ఉన్న వారంతా కంగారు పడ్డారని ఆమె చెప్పింది.

     Malaika Aroras Feelings On Dil Se Shoot

    అయితే ఈ పాత కోసం ఆమె పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలమే దక్కిందని చెప్పుకోవచ్చు. ఏ.ఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేసిన బాణీలు, దానికి తగ్గట్టుగా మలైకా వేసిన చిందులు నేటికీ మెస్మరైజ్ చేస్తుంటాయి. ఈ పాటకు కొరియోగ్రఫీ అందించిన ఫరా ఖాన్‌కు ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన మలైకా.. మహేష్ బాబు హీరోగా వచ్చిన 'అతిథి' చిత్రంలో 'రాత్రైనా ఓకే.. పగలైతే డబుల్ ఓకే' అంటూ కుర్రకారులో హీటు పెంచింది. అలాగే పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక' అంటూ తన అందాలతో కేకలు పుట్టించింది.

    English summary
    Bollywood senior acttress Malaika Arora shares her experience in Dil Se movie shooting. In this movie Chayya Chayya song is shooted on the floor of running train.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X