అతడితో గృహ నిర్బంధంలో.. అలా ఎంజాయ్ చేశా.. ముదురు వయసులో మలైకా ఘాటు రొమాన్స్
బాలీవుడ్ ప్రేమ పక్షులు మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్ వ్యవహారం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. లేటు వయసులో కూడా ఘాటుగా విహారయాత్రలు చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తమ క్వారంటైన్ లైఫ్ గురించి మీడియాకు మలైకా అరోరా చెప్పిన ఆసక్తికరమైన విషయాలు..

కరోనా పాజిటివ్ అని తేలగానే..
లాక్‌డౌన్ సమయంలో నాకు ఆరోగ్యం సరిగా ఉండక పోవడంతో వైద్యుడిని సంప్రదించాను. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వెల్లడైన ఫలితాలను బట్టి నాకు కరోనాపాజిటివ్ లక్షణాలు ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేశారు. దాంతో గృహ నిర్బంధంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మలైకా అరోరా చెప్పారు.

అర్జున్ కపూర్‌తో గృహ నిర్బంధంలో
ఆ తర్వాత అర్జున్ కపూర్‌తో గృహ నిర్బంధంలో ఉండాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అలాంటి టెన్షన్ సమయంలో అతడితో ఉంటే రిలీఫ్‌గా ఉంటుందని అనుకొన్నాను. అర్జున్ ఎప్పుడూ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటారు. అందుకే అతడి తోడును కోరుకొన్నాను అని మలైకా అరోరా తెలిపారు.

ప్రతీ క్షణం వినోదంతో
అర్జున్ కపూర్‌తో గృహ నిర్బంధంలో ఉండటంతో ప్రతీ క్షణాన్ని వినోదంతో ఆస్వాదించాను. ఎప్పుడూ నన్ను డల్‌గా ఉండనివ్వలేదు. ప్రతీ క్షణం నన్ను ఆట పట్టిస్తూ ఫన్ క్రియేట్ చేశాడు అని మలైకా అరోరా వెల్లడించారు.

గోవాలో ప్రేమ పక్షులు
ప్రస్తుతం అర్జున్ కపూర్, మలైకా అరోరా కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు గోవాకు చేరుకొన్నారు. తన సోదరి అమృతా అరోరాతో కలిసి మలైకా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











