అమేజింగ్ బ్యూటీ.. బికినీతో బ్లాస్ట్ చేసిన ఆంటీ.. బాలీవుడ్ భామలే ఫిదా అయ్యేలా
లేటు వయసులో లేలేత ప్రాయం, సిక్స్ పాక్ లుక్స్ అనేది కొందరికే సాధ్యం. ఆ ఫీట్ సాధించాలంటే వ్యాయామాలు, యోగాలు వంటివి చేసి ఎంతో శ్రమించాల్సిన అవసరముంటుంది. సీనియర్ బ్యూటీ మలైకా అరోరా మాత్రం చాలా సింపుల్‌గా ఈ ఫీట్ సాధించేసింది. 45 సంవత్సరాల మలైకా తన అందచందాలతో మరోసారి మాయ చేస్తోంది. అప్పుడెప్పుడో బాలీవుడ్ మూవీ 'దిల్ సే'లో ''చలు ఛయ్య ఛయ్యా ఛయ్య'' అంటూ ప్రేక్షకులకు మైకం కమ్మించిన ఈ భామ.. ఇప్పుడు అందాల ఆరబోతలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేసింది.

బాలీవుడ్ టు టాలీవుడ్.. సోషల్ మీడియా సెగ
బాలీవుడ్ యువతను ఉర్రూతలూగించిన మలైకా ఆ తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తన అందాల రుచి చూపించింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన 'అతిథి' చిత్రంలో 'రాత్రైనా ఓకే.. పగలైతే డబుల్ ఓకే' అంటూ కుర్రకారులో హీటు పెంచి.. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక' అంటూ కేకలు పెట్టించింది మలైకా. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముదురు భామ సోషల్ మీడియాను కూడా వదిలిపెట్టలేదు. యంగ్ హీరోయిన్లకు దీటుగా తన సెక్సీ పోజులను పోస్ట్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సెన్సేషన్ పిక్ షేర్ చేసింది మలైకా.

బీచ్ ఒడ్డున స్విమ్మింగ్ పూల్‌లో.. అబ్బో! ఆ అందాలను వర్ణించగలమా
తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కుర్రకారులో వేడి పుట్టిస్తూ తన లేటెస్ట్ బికినీ లుక్ పోస్ట్ చేసింది మలైకా. ఈ ఫొటోలో మలైకా బాడీ ఫిట్టింగ్ చూస్తే మతిపోతోంది. యంగ్ హీరోయిన్లకు కూడా సాధ్యం కానీ బాడీ ఫిట్టింగ్‌తో ఆమె చేసిన అందాల ఆరబోత యువతను రెప్ప వాల్చనీయడం లేదు. లేటు వయసులో ఈ లేలేత ప్రాయం గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. పైగా దీనిపై ''#మలైకా మండే మోటివేషన్... మీరు సంతోషంగా ఉండే ప్రదేశానికి వెళ్ళండి. హాయిగా ఎంజాయ్ చేసేయండి'' అని ట్యాగ్ చేసింది.
బికినీతో బ్లాస్ట్ చేస్తున్నావు.. అర్జున్ కపూర్ ఎక్కడ ఆంటీ?
మలైకా అరోరా బికినీతో బ్లాస్ట్ చేయడంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాకపోతే మలైకా వయస్సు 45 సంవత్సరాల పైనే కదండీ.. అందుకే నెటిజన్లు ఆమెను ముద్దుగా ఆంటీ అని పిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. భారీగా లైక్స్ కొట్టేస్తూ.. యూఆర్ సో బ్యూటిఫుల్, లవ్లీ పిక్, ఫైరింగ్ బ్యూటీ, సూపర్ ఆంటీ, అర్జున్ కపూర్ ఎక్కడ ఆంటీ?, అమేజింగ్ బ్యూటీ, బ్యూటిఫుల్ బికినీ బేబ్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

బాలీవుడ్ భామలే ఫిదా.. ఫైరింగ్ అంటూ రియాక్ట్
లేటు వయసులో ఇలా ఘాటు ఫోజులిస్తూ.. దిమ్మతిరిగే బాడీ ఎక్స్‌పోజ్ చేయడం చూసి పలువురు బాలీవుడ్ భామలు సైతం ఫిదా అయ్యారు. ఈ మేరకు సోఫీ చౌదరి, కరిష్మా కపూర్, ఈషా గుప్తా లాంటి తారలు ఈ పిక్‌ని లైక్ చేశారు. ఫైరింగ్ బ్యూటీ అంటూ రియాక్ట్ అయ్యారు. మలైకా అందాలు చూస్తుంటే ఇంకో దశాబ్ద కాలం పాటు హీటు పుట్టిస్తుందేమో అనిపిస్తోందంటూ ఇంకొంత మంది కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











