‘ఏ మగాడి తోడు అవసరం లేదు.. నా జీవితం నా ఇష్టం.. ’

బాలీవుడ్ గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు పొందిన నటి మలైకా అరోరా (Malaika Arora).బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా ఐటెం సాంగ్స్‌ స్పెషలిస్ట్‌‌గా తన కెరీర్ ను ప్రారంభించింది. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరోసారి తన వ్యక్తిగత జీవితం, రిలేషన్‌షిప్స్‌పై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. సినిమాల కంటే ఎక్కువగా తన పర్సనల్ లైఫ్, ఎఫైర్స్, బ్రేకప్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇక బోల్డ్ కామెంట్స్‌తోనూ మలైకా అరోరా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్స్‌కి గట్టి సమాధానం ఇచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

మలైకా కెరీర్ ప్రారంభం ఐటెం సాంగ్స్‌తోనే అయినా, 'చయ్యా చయ్యా' పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా ప్రత్యేక గీతాలతో కుర్రకారును అలరించింది. అయితే ఆమె ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్ కూడా ఎప్పుడూ చర్చలోనే ఉంటుంది. 1998లో అర్భాజ్ ఖాన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మలైకా, దాదాపు 20 ఏళ్ల పాటు కలిసి జీవించింది. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. కానీ, అనుకోని కారణాలతో 2017లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఈ విడాకులు అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారాయి.

Malaika Arora Slams Dating Rumors Says She Doesn t Need a Man to Feel Complete

ఆ తర్వాత మలైకా జీవితంలోకి యంగ్ హీరో అర్జున్ కపూర్ వచ్చాడు. తనకంటే దాదాపు 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్‌తో ఆమె ప్రేమాయణం కొనసాగించడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరూ సహజీవనం కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో పెళ్లి వరకు వెళ్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా చివరకు విడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉంటే.. అర్జున్‌తో బ్రేకప్ తర్వాత మలైకా డేటింగ్‌పై ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఎవరితో కనిపించినా వెంటనే డేటింగ్‌లో ఉన్నట్లు రూమార్స్ వచ్చాయి.

అయితే.. రూమర్స్ ఆమెను తీవ్ర అసహనానికి గురిచేశాయి. తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ ఘాటుగా స్పందించారు. 'ఇలాంటి వార్తలు మొదట్లో నన్ను బాధించేవి. కానీ ఇప్పుడు నేను, నా కుమారుడు అర్హాన్ వాటిని చూసి నవ్వుకుంటాం' అని చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, 'చిన్నప్పటి నుంచి నేను ఎవరిపైనా ఆధారపడలేదు. స్వయంకృషితో ఎదిగాను. నా వ్యక్తిత్వాన్ని పూర్తి చేయడానికి నాకు మగాడు అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా తోడు కావాలని అనిపిస్తే అది నా నిర్ణయం ప్రకారం.. నాకు నచ్చినట్టు ఉంటా'అని వెల్లడించింది. ప్రస్తుతం తాను రిలేషన్‌షిప్ కోసం వెతుకుతున్న దశలో లేనని, తన జీవితాన్ని తనకు నచ్చినట్లు జీవించడమే ముఖ్యమని తెలిపింది.

ఇక ఆమె ఫిట్‌నెస్ విషయానికి వస్తే.. 50 ఏళ్ల వయసులో కూడా యువ హీరోయిన్లకు పోటీగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఫిట్‌నెస్, ఫ్యాషన్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. మొత్తంగా, మలైకా అరోరా మరోసారి తన బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. రిలేషన్‌షిప్స్‌పై ఆమె ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెట్టింట్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X