యువ హీరోకు బ్రేకప్ చెప్పి.. 51 ఏళ్లలో విదేశీ క్రికెటర్‌తో గబ్బర్ సింగ్ భామ డేటింగ్
బాలీవుడ్ నటి, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ స్పెషల్ సాంగ్ బ్యూటీ మలైకా అరోరా తాజాగా వార్తల్లో నిలిచింది. ఇటీవల యంగ్ హీరోహీరోయిన్లు, స్టార్స్ విడాకులు తీసుకుంటూ తమ అభిమానులను అప్పెట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ మాత్రం తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కొత్త లైఫ్ ను స్టార్ట్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. తనకంటే వయస్సులో చిన్నవాడైనా బాలీవుడ్ ప్రొడ్యూసర్ తో మొన్నటి వరకు రిలేషన్ షిప్ లో ఉండి.. ఉన్నట్టుండి బ్రేకప్ పలికింది. ఇప్పుడు స్టార్ క్రికెటర్ ను వలలో వేసుకుంది. ఆ వివరాలకొస్తే..
బాలీవుడ్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో సంచలనం రేపింది నటి మలైకా అరోరా... 1997 నుంచే హిందీ చిత్ర పరిశ్రమలో ఈ ముదురు భాయ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ - మనీషా కోయిరాల జంటగా నటించిన 'దిల్ సే' చిత్రంలో 'చయ్యా చయ్యా' అనే సాంగ్ లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చి సెన్సేషన్ గా మారింది. అప్పటి నుంచి బాలీవుడ్ లో వరుసగా ఐటెమ్ సాంగ్స్ ల్లో నటిస్తూ మెప్పిస్తోంది. స్పెషల్ సాంగ్స్ లకు స్పెషలిస్ట్ గా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు తన కెరీయర్ లో 20కి పైగా స్పెషల్ సాంగ్స్ ల్లో నటించింది. ఇక తెలుగులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - శృతి హాసన్ జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'గబ్బర్ సింగ్' చిత్రంలో 'కెవ్వు కేక' అనే సాంగ్ తో టాలీవుడ్ లోనూ ఊపూపింది. ఒక్క పాటతోనే తెలుగు ప్రేక్షకులకు తనవైపునకు తిప్పుకుంది. తన అందం, డ్యాన్స్ తో యువతను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. చివరిగా హిందీలో 2024లో 'మజా ఏక్ నెంబర్'లో అనే స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించింది.
అయితే మలైకా అరోరా ఎక్కువ తన వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంటుంది. నిత్యం జిమ్ వర్కౌట్స్, వెకేషన్స్ కు వెళ్తూ సందడి చేస్తుంటుంది. ఆ ఫొటోలను, వీడియోలను అభిమానులతో ఇన్ స్టా ద్వారా పంచుకుంటూ ఖుషీ చేస్తుంది. ఈ క్రమంలోనే తన బాయ్ ఫ్రెండ్ విషయంలో తాజాగా హెడ్ లైన్స్ లో నిలిచింది. 51 ఏళ్లు ఉన్న ఈ ముదురు భాయ యంగ్ ప్రొడ్యూసర్ అర్జున్ కపూర్ తో మొన్నటి వరకు రిలేషన్ షిప్ లో ఉండింది. ఆయన వయస్సు 39 ఏళ్లు. తనకంటూ వయస్సులో 12 ఏళ్లు చిన్నవాడైనా ప్రొడ్యూసర్ తో రిలేషన్ షిప్ లో ఉండిందని కొన్నాళ్లుగా బాలీవుడ్ మీడియా కథనాలను అందిస్తూనే వచ్చింది.
ఇక తాజాగా మలైకా అరోరా అర్జన్ కపూర్ తో విడిపోయిందని తెలుస్తోంది. వారి మధ్య అభిప్రాయ బేధాలతో బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మలైకా అరోరా మరో కొత్త రిలేషన్ షిప్ ను ప్రారంభించిందని పుకార్లు ప్రారంభం అయ్యాయి. శ్రీలంకకు చెందిన స్టార్ క్రికెటర్ కుమార్ సంగార్కరతో ఈ ముదురు భామ రిలేషన్ షిప్ ను ప్రారంభించిందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ షిప్ తారా స్థాయికి చేరుకుందని అంటుండటం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











