అమ్మాయిలు త్వరగా పెళ్లి చేసుకోకండి.. లైఫ్‌ని ఎంజాయ్ చేయండి

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 52 ఏళ్ల వయసులోనూ తరగని అందం, అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఆమె ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్‌కు పోటీ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్‌కు పెట్టింది పేరు ఈ అమ్మడు. గతంలో మలైకా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ని పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి, ప్రేమ, విడాకులు, స్వతంత్రత వంటి అంశాలపై ఆమె చాలా ఓపెన్‌గా మాట్లాడింది. ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న వయసులో పెళ్లి చేసుకోవద్దంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

హాట్ బ్యూటీ మలైకా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆడపిల్లలు చిన్న వయసులో పెళ్లి చేసుకుని తప్పు చేయకండి. అవును.. నా జీవితంలో చాలా అందమైన విషయాలు జరిగాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే నాకు నా కుమారుడు అర్హాన్ రావడం నా జీవితంలో బెస్ట్ అనుభవం. కానీ, పెళ్లికి ముందు కొంతకాలం జీవితం ఎలా ఉంటుందో అనుభవించాలి. ఆ తర్వాతే స్థిరపడాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలి. పెళ్లి చేసుకునే ముందు మహిళలు ఆర్థికంగా, భావోద్వేగంగా స్వతంత్రంగా ఉండటం చాలా ముఖ్యం' అంటూ మలైకా షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది.

Malaika Arora s Strong Advice to Young Women Don t Marry Early Live Life First

ప్రేమ, పెళ్లిపై మలైకా మాట్లాడుతూ.. తన పెళ్లి, రిలేషన్‌షిప్స్ వర్క్ అవ్వకపోవడంపై కూడా స్పందించింది.'నా పెళ్లి, రిలేషన్‌షిప్స్ నిలవకపోయాయని ప్రేమ లేదా పెళ్లి అనే కాన్సెప్ట్ తప్పు అని నేను అనుకోవడం లేదు. అవి నాకు సరిపోలేదేమో అంతే. అయినా నాకు ప్రేమపై నమ్మకం తగ్గలేదు' అంటూ డబుల్ స్టాండర్డ్స్‌పై క్లారిటీ ఇచ్చింది.

మలైకా అరోరా 1990ల ప్రారంభంలో నటుడు అర్బాజ్ ఖాన్‌తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ 1998లో పెళ్లికి దారి తీసింది. అయితే కాలక్రమేణా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వారి వివాహ జీవితం విడాకులతో ముగిసింది. వీరిద్దరికీ అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. విడాకుల తర్వాత కూడా అర్బాజ్-మలైకా ఇద్దరూ కలిసి తమ కుమారుడిని పెంచుతూ కో-పేరెంటింగ్ చేస్తుండటం విశేషం.

విడాకుల అనంతరం మలైకా తనకంటే వయస్సులో చాలా చిన్నవాడు నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రిలేషన్‌షిప్ కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ప్రస్తుతం ఆమె హర్ష్ మెహతాతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షూరా ఖాన్‌ను వివాహం చేసుకుని మరోసారి తండ్రి కూడా అయ్యాడు.

మలైకా ఈ విషయాలపై స్పందిస్లూ.. 'నేను ప్రేమను పొందడం, పంచడం చాలా ఇష్టపడతాను. ప్రేమ అనే ఆలోచన నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. కానీ, ప్రేమ కోసం ఎదురు చూస్తూ నా జీవితాన్ని ఆపుకోను. ఒకవేళ ప్రేమ నా ఇంటి తలుపు తడితే మాత్రం ఖచ్చితంగా ఆహ్వానిస్తాను'అని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.

కెరీర్ విషయానికి వస్తే... మలైకా అరోరా ఇటీవల ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ నటించిన 'థమ్మా' చిత్రంలో 'పోయిజన్ బేబీ' అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఆమె ప్రముఖ రియాలిటీ షో 'ఇండియాస్ గాట్ టాలెంట్'కు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.

మలైకా అరోరా కామెంట్స్ పరిశీలిస్తే.. 'అమ్మాయిలూ... మీకు జీవితమంతా ఉంది. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు. ముందు లైఫ్‌ని ఆస్వాదించండి. మీ కాళ్లపై మీరు నిలబడి, ఆర్థికంగా, భావోద్వేగంగా స్వతంత్రులైన తర్వాతే పెళ్లి నిర్ణయం తీసుకోండి.' అని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X