దేనికైనా రెడీ.. డైరెక్టర్స్ కు మలయాళీ బ్యూటీ ఓపెన్ ఆఫర్

సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఉన్నంత వరకే నిలబడగలరు. దానికోసం స్టార్స్ ఎంత కష్టపడుతున్నారో అందరికి తెల్సిందే. ఇక ముఖ్యంగా హీరోయిన్లు ఆ గ్లామర్ చూపించే నాలుగు రాళ్లు వేనకేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే అదే వారి ఇన్ కమ్ సోర్స్. ఒకప్పుడు సినిమాలో కథ డిమాండ్ చేసినా కూడా కొంతమంది హీరోయిన్లు ముద్దులకు కూడా నో చెప్పేవారు. కానీ, ఇప్పుడు అలా లేదు. కథ డిమాండ్ చేయాలే కానీ, ఇంటిమేటెడ్ సీన్స్ కు కూడా సిద్ధం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఒక మలయాళీ ముద్దుగుమ్మ కూడా డైరెక్టర్స్ కు ఇలానే ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో చూద్దాం.

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాలి. 2016లో విడుదలైన లవ్ కే రన్ చిత్రం ద్వారా మాళవిక తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అసలు విడుదలకు కూడా నోచుకోలేదు. ఇక రెండేళ్ల తరువాత 2018 లో ఆ అమ్మాయి అంతే అదో టైపు అనే సినిమాతో మరోసారి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించింది. అది కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. అసలు రిలీజ్ అయ్యిందో లేదో కూడా తెలియదు.

Malavika Menon open statement about do romantic roles in tollywood movies

ఇక ఈ రెండు సినిమాలతో ఈ చిన్నది తెలుగువారికి చేరువ అవుతుంది అనుకున్నా.. కానీ, అవ్వలేకపోయింది. దీంతో మాళవిక తెలుగు వదిలి తమిళ్, మలయాళంలోనే సెటిల్ అయ్యింది. ఇక సినిమాల్లో కాకుండా సోషల్ మీడియా లో కూడా ఆమె తన నాదంతో అభిమానులకు దగ్గరయింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగువారికి కూడా దగ్గరయింది.

తాజాగా ఆమె మలయాళంలో నటించిన వన్స్ అపన్‌ ఏ టైమ్ ఇన్ కొచి ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి హిట్ అందుకుంది. కెరీర్ మొదలుపెట్టినప్పటినుంచి దాదాపు 42 సినిమాల్లో నటించిన అనంతరం ఆమెకు ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇక దీంతో ఈ చిన్నదాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన మనసులోని మాటలను బయటపెట్టింది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా సిద్దమే అని డైరెక్టర్స్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది.

Malavika Menon open statement about do romantic roles in tollywood movies

నేను తెలుగు, తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించాను. 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. మలయాళంలో అభినయానికి అవకాశం ఉన్న పాత్రలు లభిస్తాయి. తెలుగు, తమిళ సినిమాల్లో గ్లామర్‌కు ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. అయితే నేను నటించిన ఏ సినిమాలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. కానీ, ఇప్పుడు అలాంటి పాత్రలు చేయమన్నా చేస్తా. కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్స్, గ్లామర్ పాత్రలు చేసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అమ్మడు మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తెలుగు, తమిళ్ డైరెక్టర్స్ కు మాళవిక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే అని చెప్పాలి. అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ రొమాంటిక్ సీన్స్ చేస్తే.. ఇక కుర్రాళ్లకు కునుకు ఉండదు. ఇంకోపక్క ఇలాంటి ఆఫర్ ఇస్తే ఏ డైరెక్టర్ అయినా కళ్లకు అద్దుకొని తీసుకుంటాడు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ చిన్నదాని ఓపెన్ ఆఫర్ ను ఏ డైరెక్టర్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X