నన్ను పెళ్లి చేసుకొంటావా? నెటిజన్‌కు యువ హీరోయిన్ దిమ్మతిరిగే జవాబు
ప్రెజెంట్ సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి పాపులారిటీ ఉన్నటువంటి యువ హీరోయిన్స్ చాలా మందే ఉన్నారని చెప్పాలి. కాగా ఈ హీరోయిన్స్ లో మన తెలుగు సహా తమిళ్ కన్నడ, మలయాళ భాషల నుంచి అందాల ముద్దుగుమ్మలు ఉంటే వారిలో తమ గ్లామర్ షోస్ తో అదరగొట్టే కొందరు డస్కీ హీరోయిన్స్ కూడా ఉన్నారు. మరి వీరిలో పూజా హెగ్డే అని మాళవిక మోహనన్ అని ఇంకా డింపుల్ హయాతి లాంటి స్టార్స్ కూడా ఉన్నారు.
కాగా ఈ హీరోయిన్స్ లో ఎవరూ కూడా ఇంకా పెళ్లిళ్లు చేసుకోలేదు.. వీరిలో ఓ హీరోయిన్ అయితే తన పెళ్లి కోసం నోరు విప్పింది. ఆ హీరోయినే మాళవిక మోహనన్. మాళవిక తమిళ్ లో పలు చిత్రాలు చేస్తుండగా తెలుగులో కూడా ఓ సినిమా చేస్తుంది. కాగా మాళవిక నటిగా మాత్రమే కాకుండా తన గ్లామరస్ షోతో సోషల్ మీడియాలో కూడా అదరగొడుతుంది.

ఇప్పుడు రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో ఓ చిట్ చాట్ సెషన్ ని నిర్వహించగా అందులో మాళవిక తన పెళ్లి కోసం ఓపెన్ అయ్యింది. నెటిజన్స్ లో ఒకరు మాళవిక పెళ్లెప్పుడు అని ప్రశ్న వేయగా ఆమె ఆ ప్రశ్నకి కొంచెం హర్ట్ అయ్యినట్టే ఉందని చెప్పాలి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అనే ప్రశ్నకి బదులిస్తూ.. "నన్నెందుకు పెళ్లి చేసుకున్నాక చూద్దాం అనుకుంటున్నావు?" అంటూ చిన్నగా చిన్నబుచ్చికున్నట్టుగా ఎక్స్ ప్రెషన్ పెట్టి రిప్లై ఇచ్చింది.
దీనితో ఆమె పెళ్లి విషయంలో మాత్రం ప్రస్తుతానికి అంతగా ఆసక్తిగా లేనట్టే ఉందని చెప్పాలి. ప్రస్తుతానికి మాళవికకి ప్రస్తుతానికి 30 ఏళ్ళు.. సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది కానీ ఈ ఏజ్ కి వచ్చాక కూడా ఈమె పెళ్లి పట్ల అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేదనే అనుకోవాలి. ఇక మాళవిక ప్రెజెంట్ కోలీవుడ్ లో నటించిన పాన్ ఇండియా చిత్రం "తంగలాన్" సినిమాలో నటించగా ఇందులో చియాన్ విక్రమ్ హీరోగా నటించాడు.
అలాగే ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించాడు. ఇక తెలుగులో అయితే ఈమె రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన భారీ చిత్రం "ది రాజా సాబ్" లో హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా తోనే ఈమె తెలుగు సినిమాకి పరిచయం కాబోతుంది. అలాగే ఈ సినిమాలో తనతో పాటుగా నిధి అగర్వాల్, రాధే శ్యామ్ ఫేమ్ నటి రిద్ధి కుమార్ కూడా నటిస్తుంది.
మరి తెలుగులో మాళవిక ఎలాంటి ఎంట్రీ అందుకుంటుందో చూడాలి. ఇక రాజా సాబ్ చిత్రాన్ని దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తుండగా సంగీత దర్శకుడు థమన్ వర్క్ చేస్తున్నాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











