ప్రభాస్ సినిమాపై మాళవిక మోహనన్ హాట్ కామెంట్స్.. కొత్త అనుమానాలు రేపిన బోల్డ్ బ్యూటీ
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన తెలుగు హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పుకోవాలి. కాగా ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం "కల్కి 2898 ఎడి" తో మళ్ళీ తాను బాక్సాఫీస్ ని షేక్ చేసి ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు.
ఇండియా నుంచి యూఎస్ మార్కెట్ వరకు ఆల్ టైం రికార్డు వసూళ్లు అందుకొని ప్రభాస్ కెరీర్ లో రెండో అతి పెద్ద హిట్ ని కొట్టాడు. కాగా ఈ హిట్ తర్వాత ట్రాక్ లోకి వచ్చిన ప్రభాస్ నుంచి మరిన్ని బిగ్ ప్రాజెక్ట్ లు వస్తుండగా ఈ చిత్రాల్లో లీస్ట్ హైప్ ఉన్న సినిమా "ది రాజా సాబ్" కూడా ఒకటి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తుండగా మొదట్లో ఈ సినిమా పట్ల రెబల్ ఫ్యాన్స్ ఏమంత ఎక్కువ ఆసక్తిగా అయితే కనపడలేదు.

పైగా సినిమా ఆపేయాలని కూడా ట్రెండ్ చేశారు. కానీ ఫైనల్ గా తన వర్క్ తో మారుతి అందరినీ సైలెంట్ చేసాడు. కాగా ఈ చిత్రంని మారుతీ ఒక హారర్ అలాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ అన్నట్టు ప్రెజెంట్ చేసాడు. ఐతే ప్రభాస్ ఇప్పుడు వరకు రొమాంటిక్ చేసాడు, కామెడీ కూడా చేసాడు కానీ ఈ రాజా సాబ్ అనే సినిమాలో హారర్ ఎలిమెంట్ అనేది ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేయడంతో ఈ సినిమాపై మినిమమ్ అంచనాలు అయినా సెట్ అయ్యాయి.
కానీ ఈ సినిమాలో నటిస్తున్న కోలీవుడ్ హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ మాళవిక మోహనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేశాయి. ఈమె చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ గా మారాయి. ది రాజా సాబ్ లో తన రోల్ లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని ఇప్పుడు వరకు సినిమా పూర్తయ్యిపోయింది. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా అంటూ సెలవిచ్చింది.

దీనితో ఇదేంటి ఈ సినిమా హారర్ కామెడీ కదా మాళవిక కేవలం రొమాంటిక్ కామెడీ అంటుంది ఏంటా అని కన్ఫ్యూజన్ అవుతున్నారు. దీనితో ఈ భారీ సినిమాపై ఇపుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీటితో ఫ్యాన్స్ కూడా ఓ క్లారిటీ కోరుకుంటున్నారు. ఇక రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ ఈ అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా వస్తుంది అని పలు రూమర్స్ బయటకి వచ్చాయి కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఎస్ కే ఎన్ క్లారిటీ ఇచ్చేసాడు.
ప్రస్తుతం అయితే సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్ మాత్రమే కాకుండా మరో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్, రాధే శ్యామ్ ఫేమ్ రిద్ధి కుమార్ కూడా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కి రాబోతుంది.


Click it and Unblock the Notifications











