ప్రభాస్‌పై మాళవికా ఎమోషనల్ కామెంట్స్.. నాలుగైదు సీన్స్ అనుకుంటే..

మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళం, మలయాళంలో గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్నది ఈ నటి, ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్' (The Raja Saab) మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. అయితే.. తాజాగా ఈ అమ్మడు డార్లింగ్ ప్రభాస్ పై, తాను నటించిన ది రాజాసాబ్ సినిమాపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం అన్నారంటే?

హీరోయిన్ మాళవికా మోహనన్ తాజాగా జరిగిన సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ది రాజా సాబ్ సినిమాలోతాను చేసే పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమ్మిట్‌లో హీరోయిన్ మాళవికా మాట్లాడుతూ.. "స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ పాత్ర సాధారణంగా 4-5 సీన్స్, ఒకటి రెండు పాటలకే పరిమితం అవుతుంది. నిజం చెప్పాలంటే 'ది రాజా సాబ్'లోనూ అలాగే ఉంటుందని అనుకున్నా. కానీ నాకు అందిన పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. ఇది నా తెలుగు డెబ్యూ... ఇంత మంచి రోల్ రావడం నిజంగా అదృష్టం." అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మాటలతో ఆమె సినిమాలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను స్పష్టంగా అర్థం అవుతోంది.

Malavika Mohanan Gets Emotional About Prabhas and Her Lead Role in The Raja Saab

ఇక ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసే అవకాశం గురించి మాళవిక మాట్లాడుతూ.. డార్లింగ్ పై ప్రశంశలు కురిపించింది. "భారతదేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్‌లలో ఒకరైన ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేయడం నాకు గౌరవం" అని భావోద్వేగంగా చెప్పింది. ప్రభాస్‌, మాళవిక కాంబినేషన్‌లో రొమాంటిక్‌ సీన్లు మాత్రమే కాదు... హారర్‌ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రభాస్ పై అభిమానాన్ని పంచుకోవడంతో ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది.

మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హారర్-కామెడీ-రోమాన్స్ మేళవింపుతో రూపొందుతోంది. ప్రభాస్‌ పాత్రలో రొమాంటిక్ షేడ్స్‌తో పాటు హాస్యభరిత సన్నివేశాలు, సూపర్ నేచురల్ ఎలిమెంట్లు ఉంటాయని టాక్. మీరోయిన్ మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీ సంక్రాంతి 2026 గ్రాండ్ రిలీజ్... ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'కల్కి 2898 AD' వంటి మెగా ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్ సినిమాగా 'ది రాజా సాబ్'పై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మాళవికా పాత్రకు ఉన్న వెయిటేజ్‌తో ఈ సినిమా ఆమెకు బెంచ్‌మార్క్ అవుతుందని ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే.. రాజా సాబ్ మూవీ ప్రభాస్ కెరీర్ లో కూడా మైల్ స్టోన్ మూవీ గా మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X