రష్మిక మందన్న గోల్డెన్ ఆఫర్ కొట్టేసిన బోల్డ్ బ్యూటీ.. ఆ పాత్ర నేషనల్ క్రష్‌కు వర్కవుట్ అయేదా?
ఇపుడు టోటల్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ జాబితా తీస్తే అందులో ఖచ్చితంగా కనిపించే పేరు నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పేరు కూడా ఉంటుంది. అయితే ఒక టైం లో టాలీవుడ్ మోస్ట్ బిజీగా మారిన హీరోయిన్ గా రష్మికా తక్కువ సినిమాలతోనే స్టార్ స్టేటస్ ని తెచ్చేసుకుంది. పైగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ తర్వాత తమిళ్ నుంచి బిగ్ స్టార్ విజయ్ దళపతి లాంటి వారితో నటించే అవకాశాన్ని అనతి కాలంలోనే పట్టేసింది.
అయితే రష్మికా బిజీ లైఫ్ లో పలు భారీ ఆఫర్స్ ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. అలా ఆ మధ్య కల్కి 2898 ఎడి లాంటి సెన్సేషనల్ సినిమాలో కూడా ఛాన్స్ మిస్ చేసుకుంది అని టాక్ వచ్చింది. కాగా ఇప్పుడు మరో షాకింగ్ రోల్ ని అయితే రష్మిక మిస్ చేసుకున్నట్టుగా వార్తలు బయటకి వచ్చాయి. రీసెంట్ గా కోలీవుడ్ సినిమా నుంచి వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం "తంగలాన్" సినిమా లోనే రష్మిక ఒక ఊహించని రోల్ ని చేయాల్సి ఉందట.

కానీ డేట్స్ కుదరని కారణంగా ఆమె ఈ సినిమాలో చేయలేకపోయింది అని తెలిసింది. తంగలాన్ లో విక్రమ్ సరసన ఇద్దరు బ్యూటీస్ కనిపించారు. విక్రమ్ సరసన పార్వతి తిరువొత్తు కాగా మరో రోల్ లో బోల్డ్ హీరోయిన్ మాళవిక మోహనన్ నటించింది. అయితే ఈ సినిమాలో విక్రమ్ తో పాటుగా నటి మాళవిక మోహనన్ నటన చూసి అంతా షాక్ అయ్యారు.
ఇన్ని రోజులు సింపుల్ గా కనిపించిన మాళవిక ఒక మంత్రగత్తెగా ఊహించని పెర్ఫామెన్స్ ని యాక్షన్ ని కూడా చేసి చూపించింది. మరి ఈ క్లిష్టమైన పాత్రనే రష్మికా మందన్నా వదులుకుందట. నిజానికి దర్శకుడు పా రంజిత్ మాళవిక ప్లేస్ లో మొదట రష్మికా మందన్నానే పర్ఫెక్ట్ గా సెట్టవుతుంది అని ఆమెని అప్రోచ్ అయ్యాడట కానీ రష్మికాకి డేట్స్ కుదరకపోవడం మూలాన మాళవిక లైన్ లోకి వచ్చి తన రోల్ లో అదరగొట్టేసింది.

మరి ఇదే రోల్ లో రష్మిక కానీ చేసుంటే ఆ మేకోవర్ కి యాక్షన్ ఈమె కూడా ఫిట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఏది ఏమైతేనేం.. ఏ నటుడు లేదా నటి అయినా కూడా తమ కెరీర్లో గుర్తుండిపోయే రోల్ ని చేయాలి అని ఎవరైనా అనుకుంటారు. కానీ అలాంటి రోల్ ని ఇప్పుడు రష్మికా మిస్ చేసుకొని ఒక గోల్డెన్ ఆఫర్ లాంటిది వదులుకుంది.

దానిని మాళవిక ఒడిసిపట్టుకుని తన కెరీర్ లో పెర్ఫార్మర్ గా ఒక్క రోల్ ని చూపించమంటే ఈ సినిమాలో రోల్ ని చూపించే విధంగా రక్తి కట్టించింది. ఇక ప్రస్తుతం మాళవిక తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం "యుధ్ర" రిలీజ్ పనుల్లో బిజీగా ఉండగా రష్మికా మందన్నా "పుష్ప 2", ధనుష్ తో "కుబేర", బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో "సికందర్" లాంటి పలు భారీ సినిమాలతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











