హాట్ హీరోయిన్ చేతికి గాయాలు.. కళ్ళకు కూడా గాయాలు.. షూట్ లో ప్రమాదం, అసలు ఏమైందంటే?
మలయాళ భామ మాళవికా మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర లేదు. తెలుగు సినిమాలు చేయకపోయినా డబ్బింగ్ తమిళ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక అప్డేట్స్ అందించే ఈ భామ తాజాగా తన చేతికి గాయమైన విషయాన్ని కూడా పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

ఆసక్తి పెరిగి
మలయాళ భామ మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులని తెగ అలరిస్తూ ఉంటుంది. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె అయిన మాళవిక ముంబైలో జన్మించారు. ఆమె కుటుంబం కేరళకు చెందినదే అయినా ఆమె ముంబైలో మోహనన్ సెటిల్ అవడంతో మాళవిక కూడా అక్కడే పుట్టి పెరిగింది. తండ్రి స్వయానా సినిమాటోగ్రాఫర్ అలాగే డైరెక్టర్ కూడా కావడంతో ఆమెకు కూడా అదే రంగం మీద ఆసక్తి పెరిగింది.

హీరోయిన్ అవకాశం
దీంతో ఆమె ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసి ఆ తరువాత చదువుకోకుండా తన తండ్రి తో పాటు ఆయన పని చేస్తున్న సినిమాటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకుంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చేస్తున్న ఒక ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ కోసం ఆమె కూడా తండ్రి తో పాటు పని చేసింది. ఆ యాడ్ లో తండ్రికి సాయం చేస్తున్న మాళవిక బాగుండడంతో ఆమెకు నటన మీద ఆసక్తి ఉందనే విషయం తెలుసుకున్న మమ్ముట్టి తన కుమారుడు దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చారు.

మాస్టర్ అనే సినిమాలో
ఆ సినిమాతో తెరంగేట్రం అయితే చేసింది కానీ ఆమెకు పేరు వచ్చింది మాత్రం రజనీకాంత్ హీరోగా రూపొందిన పెట్టా సినిమాతోనే. ఆ సినిమాలో ఆమె కీలక పాత్రల్లో నటించి తమిళ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఈ సినిమా పేట పేరుతో తెలుగులో విడుదల కాగా ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇక 2021లో విజయ్ మాస్టర్ అనే సినిమాలో కూడా మాళవిక నటించి మంచి పేరు తెచ్చుకుంది.

అభిమానులు షాక్
అలాగే ఇపుడు ఆమె స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ నటిస్తున్న 'మారన్' మూవీలో కథానాయికగా నటిస్తోంది. అదే సమయంలో రవి ఉడయార్ దర్శకత్వంలో సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటిస్తున్న 'యుత్ర' అనే హిందీ సినిమాలో కూడా మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆమె చేతికి గాయమైందట. మాళవిక పోస్ట్ చేసిన ఫొటోలను చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.
Recommended Video

చేతికి గాయంతో
చేతికి గాయంతో కనపడుతుండడమే కాక ఆమె కాలికి కూడా గాయాలయినట్లు తెలుస్తోంది. తలపై చేయి పెట్టుకుని గాయాలను చూపిస్తూ ఆమె ఈ ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే ఆమె మాత్రం యాక్షన్ సినిమా షూటింగ్‌లో గాయాలపాలు అవుతుండడం సాధారణమేనని ఆమె చెప్పింది.


Click it and Unblock the Notifications











