పవన్ కల్యాణ్ సినిమాపై ఊహించని ఫేక్ న్యూస్.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరోయిన్!
మాళవిక మోహనన్.. ఈమధ్య కాలంలో సౌత్ లో వరుస సినిమాలతో హాట్ టాపిక్ గా మారుతోంది. 2013లో మలయాళ సినిమా పట్టం పోల్ తో చిత్రసీమలో అడుగు పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ.. 2019లో పేట అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మాస్టర్, మారన్ అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ మూడు సినిమాలు తెలుగులోనూ డబ్ కావడంతో.. తెలుగు ప్రేక్షకులకు ఈమె దగ్గరైంది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ... ట్విట్టర్ వేధికగా ఓ విషయాన్ని వెల్లడించింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా అభిమానం అని చెప్పింది. కానీ తాను అంతా అనుకున్నట్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో భాగం కాదని వివరించింది. ప్రస్తుతం తాను తెలుగులో ఓ అద్భుతమైన చిత్రం కోసం పని చేస్తున్నట్లు వెల్లడించింది. అందులోనూ రెండో హీరోయిన్ గా కాదని.. మెయిన్ లీడ్ లోని అని స్పష్టం చేసింది. తాను తెలుగులో మొదటగా చేస్తున్న సినిమా ఇదేనని వివరించింది. అలాగే తాను టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొంది.

అయితే మాళవిక మోహవన్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ఓ సినిమా కోసం పని చేస్తుందని.. అలాగే పవన్ కల్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. శ్రీలీల, మాళవిక మోహనన్ ఇద్దరూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారని.. శ్రీలీల మహేష్ బాబుతో పాటు, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ఛాన్సు కొట్టేసినట్లు... డెయిలీ కల్చర్ అనే ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. అయితే ఇది చూసిన మాళవిక ఫైర్ అయింది.

ఈ క్రమంలోనే ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ... తాను ఈ చిత్రంలో నటించడం లేదని స్పష్టం చేసింది. మాళవిక ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఓ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా... రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పై ఉంది. మరోవైపు మలయాళంలో ఆమె నటించిన క్రిస్టీ అనే చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Click it and Unblock the Notifications











