twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కిటికీల డ్రెస్సుతో సినిమాటోగ్రాఫర్ కుమార్తె సోకుల విందు.. ఘాటు పోజులతో హాట్ ఫొటోలు

    |

    ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ కె.యు మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది గ్లామరస్ హీరోయిన్​ మాళవిక మోహనన్. 2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ సరసన నటించే అవకాశం కొట్టేసింది. దీంతో పేట అనే చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. ఆ తర్వాత ఇళయదళపతి విజయ్ సరసన మాస్టర్​లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ భామ మరోవైపు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. అప్పుడప్పుడు తన అందం ఒలకబోస్తూ హాట్ గా ఫొటోలు పెడుతూ హైలెట్ అవుతుంటుంది.

    రజనీ కాంత్ చిత్రంలో..

    రజనీ కాంత్ చిత్రంలో..

    మాళవిక మోహనన్​ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సూపర్ స్టార్​ రజనీ కాంత్ నటించి పేటా మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది మాళవిక మోహనన్. అనంతరం విజయ్​ సరసన నటించిన మాస్టర్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్​ ఉన్న ధనుష్​ సరసన నటించింది.

    ఆస్క్ మీ సెషన్ లో..

    ఆస్క్ మీ సెషన్ లో..

    ధనుష్, మాళవిక మోహనన్​ జంటగా నటించిన చిత్రం మారన్​. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ, ఈ చిత్రంలో మాళవిక మొహనన్ నటించిన ఇంటిమేట్ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఆస్క్​ మీ సెషన్​ నిర్వహించింది మాళవిక.

    ఎన్నిసార్లు చేశారు..

    ఎన్నిసార్లు చేశారు..

    మాళవిక మోహనన్ నిర్వహించిన సోషల్ మీడియా ఆస్క్ మీ సెషన్ లో ఓ నెటిజన్​ మారన్ చిత్రంలోని ఇంటిమేట్ సీన్ గురించి అడిగాడు. మారన్​ మూవీలో బెడ్​ సీన్​ కోసం ఎన్నిసార్లు షూట్​ చేశారు అని మాళవిక మోహనన్​ ఓ నెటిజన్ అడిగాడు. అందుకు ఆమె దీటుగానే ఆన్సర్​ ఇచ్చింది. నీ తలలో ఏదో పాడైనట్టుంది. అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే విధంగా గట్టిగా కౌంటర్​ ఇచ్చింది బ్యూటిఫుల్ మాళవిక మోహనన్.

    అలా ఓ సినిమా..

    అలా ఓ సినిమా..

    అయితే మాళవిక మోహనన్​ అప్పుడే తనకు బాలీవుడ్​ సీనియర్​ అండ్​ బ్యూటిఫుల్​ హీరోయిన్​ ఐశ్వర్యరాయ్ బయోపిక్​లో నటించాలని ఉందని సోషల్​ మీడియా వేదికగా బయటపెట్టింది. అలాగే తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందన్న ప్రశ్నకు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ పేరు చెప్పింది ఈ బ్యూటీ. విజయ్​ దేవరకొండతో రొమాంటిక్​ కామెడీ గానీ, లేదా పూర్తి రొమాంటిక్ జోనర్​లో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపింది మాళవిక మోహనన్.

     తెలియరాని కారణాలు..

    తెలియరాని కారణాలు..

    మాళవిక మోహనన్ చెప్పడం ఏమో గానీ విజయ్ దేవరకొండ-మాళవిక కాంబినేషన్​లో ఓ సినిమా చేయాల్సి వచ్చింది. హీరో అనే టైటిల్ పేరుతో ప్రారంభమైన ఈ మూవీకి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అనంతరం కొంతమేర షూటింగ్ కూడా జరిగింది. మరి ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా చిత్రీకరణను ఆపేశారు. అయితే అందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

    ఎద అందాలతో..

    మాళవిక మోహనన్​ గతంలో బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​తో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. ఇదిలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మాళవిక సోషల్​ మీడియాలో తన అందాలను హాట్​హాట్​గా ప్రదర్శిస్తూ యూత్​ను కట్టిపడేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్​లో సూపర్ హాట్ గా పొజులిచ్చింది మాళవిక మోహనన్. ఆ డ్రెస్సు ఎద భాగంలో కిటికిల వలే ఉండి క్లీవేజ్ షో చేసింది ఈ బ్యూటి. విభిన్నమైన పోజులిస్తూ తన ఎద, షోల్డర్ అందాలను హాట్ గా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు యువతను ఆకట్టుకుంటున్నాయి.

    English summary
    Mollywood Beautiful Heroine Malavika Mohanan Latest Sizzling Glamour Photos In Black Dress Pics Going Viral in Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X