Malavika Mohanan: రెడ్​ డ్రెస్ లో మాళవిక మోహనన్ గ్లామర్ షో.. 9 రాత్రులు అంటూ

పాపులర్ సినిమాటోగ్రాఫర్​ కె.యు మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది బ్యూటిఫుల్​ హీరోయిన్​ మాళవిక మోహనన్. 2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ నటించిన పేట మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం విజయ్ సరసన మాస్టర్​లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ భామ మరోవైపు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుందు. అప్పుడప్పుడు తన గ్లామర్ చూపిస్తూ గ్లామర్ ఫొటోలు పెడుతూ హైలెట్ అవుతుంటుంది.

మాళవిక మోహనన్​ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సూపర్ స్టార్​ రజనీ కాంత్ నటించి పేటా మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది మాళవిక మోహనన్. అనంతరం విజయ్​ సరసన నటించిన మాస్టర్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

ధనుష్​ సరసన..

ధనుష్​ సరసన..

తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్​ ఉన్న ధనుష్​ సరసన నటించింది. ధనుష్, మాళవిక మోహనన్​ జంటగా నటించిన మారన్​ మూవీకి అంతగా హిట్​ టాక్​ రాలేదు.

ఆస్క్​ మీ సెషన్ లో..

ఆస్క్​ మీ సెషన్ లో..

కానీ, ఇందులో ఆమె నటించిన ఇంటిమేట్ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ఆమె ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఆస్క్​ మీ సెషన్​ నిర్వహించింది. అందులో ఓ నెటిజన్​ ఈ ఇంటిమేట్ సీన్ గురించి అడిగిన విధానం చూస్తే అలానే అనిపిస్తుంది.

 బెడ్​ సీన్​ కోసం ఎన్నిసార్లు..

బెడ్​ సీన్​ కోసం ఎన్నిసార్లు..

ఆస్క్​ మీ సెషన్​లో మారన్​ మూవీలో బెడ్​ సీన్​ కోసం ఎన్నిసార్లు షూట్​ చేశారు అని మాళవిక మోహనన్​ ఓ నెటిజన్ అడిగాడు. అందుకు ఆమె దీటుగా ఆన్సర్​ ఇచ్చింది. నీ తలలో ఏదో పాడైనట్టుంది. అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే విధంగా గట్టి కౌంటర్​ ఇచ్చింది.

ఐశ్వర్యరాయ్ బయోపిక్​లో..

ఐశ్వర్యరాయ్ బయోపిక్​లో..

అలాగే మాళవిక మోహనన్​కు బాలీవుడ్​ సీనియర్​ అండ్​ బ్యూటిఫుల్​ హీరోయిన్​ ఐశ్వర్యరాయ్ బయోపిక్​లో నటించాలని ఉందని సోషల్​ మీడియా వేదికగా బయటపెట్టింది. అలాగే తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందన్న ప్రశ్నకు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ పేరు చెప్పింది ఈ బ్యూటీ.

 విజయ్​ దేవరకొండతో రొమాంటిక్ మూవీ..

విజయ్​ దేవరకొండతో రొమాంటిక్ మూవీ..

విజయ్​ దేవరకొండతో రొమాంటిక్​ కామెడీ గానీ, లేదా పూర్తి రొమాంటిక్ జోనర్​లో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపింది మాళవిక మోహనన్. అయితే వీరిద్దరి కాంబినేషన్​లో ఓ సినిమా చేయాల్సి ఉంది. హీరో పేరుతో ప్రారంభమైన ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

 యూత్​ను కట్టిపడేస్తూ..

యూత్​ను కట్టిపడేస్తూ..

అనంతరం కొంతమేర షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. అందుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. మాళవిక మోహనన్​ గతంలో బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​తో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మాళవిక సోషల్​ మీడియాలో తన అందాలను హాట్​హాట్​గా ప్రదర్శిస్తూ యూత్​ను కట్టిపడేస్తుంది.

 అందంగా మాళవిక మోహనన్..

అందంగా మాళవిక మోహనన్..


తాజాగా రెడ్​ డ్రెస్​లో అందంగా కనిపించింది మాళవిక మోహనన్. పెద్ద ఇయర్ రింగ్స్ తో గ్లామర్ లుక్ లో ఆకర్షిస్తోంది ఈ బ్యూటి. అయితే ఈ ఫొటోలను దేవీ నవరాత్రుల సందర్భంగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 'తొమ్మిది రోజులు, తొమ్మిది రాత్రుల పండుగ. ప్రార్థనలు, వెలుగులు, డ్యాన్స్' అంటూ పోస్ట్ కు రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X