జాకెట్ కూడా లేకుండా రెచ్చిపోయిన మాళవిక.. నెవర్ బిఫోర్ అవతార్ లో రచ్చ!
మలయాళ భామ మాళవిక మోహన్ తెలుగులో నేరుగా సినిమాలు చేయక పోయినా తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకునే ఈ భామ తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫోటో సంచలనం రేపుతోంది. ఈ ఫోటోలో ఆమె చీర కట్టులో కనిపిస్తూనే జాకెట్ ధరించకుండా తన ఎద భాగాన్ని చీరతో కప్పేసింది. ఆ వివరాల్లోకి వెళితే

ఆయన కుమార్తె
మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె అయిన మాళవిక ముంబైలో జన్మించారు. ఆమె కుటుంబం కేరళకు చెందినదే అయినా ఆమె ముంబైలో సెటిల్ అయిన తన తల్లిదండ్రులకు జన్మించింది. తండ్రి స్వయానా డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కావడంతో ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన ఆమె తరువాత చదువుకోకుండా తన తండ్రి తో పాటు సినిమాటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకుంది.

అలా సినిమా ఆఫర్
అలా మమ్ముట్టి చేస్తున్న ఒక ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ కోసం ఆమె కూడా తండ్రి తో పాటు పని చేసింది. ఆ యాడ్ లో తండ్రికి సాయం చేస్తున్న అమ్మాయి బాగుండడంతో ఆమెకు నటన మీద ఆసక్తి ఉందనే విషయం తెలుసుకున్న మమ్ముట్టి తన కుమారుడు సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చారు.

అలా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి
ఆ సినిమా పట్టం పోలే కాగా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం కంటే ముందే అనేక సార్లు ఆలోచించి చివరకు సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. అయితే కాస్ట్యూమ్ డిజైనర్ ల తో పనిచేయడం కొత్త కావడంతో ఆమె వాళ్ళతో పని చేయకుండా తన బట్టలు తానే డిజైన్ చేసుకుంది. అలా మొదటి సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కవుట్ కాకపోయినా ఆమెకు తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి.

వరుస సినిమాలు
మలయాళంలో రెండు సినిమాలు చేసిన తర్వాత కన్నడలో సినిమా ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత కన్నడ సినిమా పూర్తి చేసిన వెంటనే హిందీ సినిమా అవకాశం వచ్చింది. అయితే రజనీకాంత్ హీరోగా రూపొందిన పెట్టా సినిమాలో ఆమె కీలక పాత్రల్లో నటించి తమిళ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఈ సినిమా పేట పేరుతో తెలుగులో విడుదల కాగా ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక 2021లో విజయ్ మాస్టర్ అనే సినిమాలో కూడా మాళవిక నటించి మంచి పేరు తెచ్చుకుంది.
Recommended Video

జాకెట్ లేకుండా
మాళవిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోలు షేర్ చేస్తూ అభిమానుల దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే తాజాగా ఓ ఫోటోను షేర్ చేసిన మాళవిక ఆ ఫొటోలో చీరకట్టులో జాకెట్ లేకుండా కనిపిస్తోంది. నేను వేరే యుగంలో జన్మించినట్లయితే, ఖచ్చితంగా ఒక యోధ యువరాణిని, అందమైన యువరాణిని అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇక ఆమె ఇలాంటి ఫోటో పెడితే అభిమానులు ఆగుతారా? రకరకాల కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











