రోడ్డుపైనే హీరోయిన్ పరువాల ప్రవాహం.. ఆ అందాలు చూస్తే మెంటలే బ్రో

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. హీరో హీరోయిన్ల వారసులే కాకుండా టెక్నీషియన్స్ కుమారుడు, కుమార్తెలు కూడా చిత్ర పరిశ్రమలో రాణిస్తుంటారు. అలా పరిచయం అయిన ముద్దుగుమ్మల్లో మాళవిక మోహనన్ ఒకరు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెయు మోహనన్ కూతురిగా మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ గ్లామరస్ చిన్నది ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఎక్కడా పడితే అలా, ఎలా అంటే అలా చూపిస్తూ సెన్సేషన్ అవుతోంది. మాళవిక మోహనన్ తాజా ఫొటోలపై లుక్కేస్తే..

దుల్కర్ సినిమాతో: చేసింది కొన్ని సినిమాలే అయిన గ్లామరస్ బ్యూటిగా, మంచి నటిగా ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ మాళవిక మోహనన్​ (Malavika Mohanan). ఈ చిన్నది ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే దుల్కర్ సల్మాన్ నటించిన పట్టం పోలే అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది మాళవిక మోహనన్. అక్కడ కొన్ని సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.

Malavika Mohanan

ఫోకస్ అయిన బ్యూటి: అనంతరం సూపర్ స్టార్​ రజనీ కాంత్ హీరోగా చేసిన పేటా మూవీలో నటించి అట్రాక్ట్ చేసింది మాళవిక మోహనన్. కీర్తి సురేష్ కూడా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. కానీ, మాళవిక మాత్రం ప్రజల్లో ఫోకస్ అయింది. అందుకే ఆమెకు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా అగ్ర హీరోల సరసన ఆడిపాడగలిగింది ఈ బ్యూటి.

విక్రమ్ డైరెక్టర్: పెటా మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్​ తో జోడికట్టింది బ్యూటిఫుల్ మాళవిక మోహనన్. విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మాస్టర్ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది అందాల సుందరి మాళవిక మోహనన్. ఈ సినిమాతో తెలుగులో కూడా కొద్దిమేర పాపులారిటీ దక్కించుకుంది ఈ గ్లామర్ డాల్.

Malavika Mohanan

ఘాటు రొమాన్స్-స్ట్రాంగ్ రిప్లై: మాస్టర్ సినిమా తర్వాత మాళవిక మోహనన్ మరో తమిళ అగ్ర హీరో ధనుష్ సరసన నటించింది. వీరిద్దరు కలిసి మారన్ సినిమాలో ఘాటు రొమాన్స్ చేశారు. ధనుష్ తో మాళవిక చేసిన ఇంటిమేట్ సీన్లపై నెటిజన్ వంకరగా కామెంట్ చేశాడు. దీంతో అతనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది ఈ బ్యూటి. అయితే ఈ మారన్ సినిమా కూడా అంతగా హిట్ కాలేదు.

విక్రమ్-తంగలాన్: అయితే సినిమాల ఫలితం ఎలా ఉన్నా వెనువెంటనే ముగ్గురు స్టార్ హీరోల సరసన నటించిన ఘనత అందుకున్న మాళవిక మోహనన్ నటనపరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందుకే ఆమెను సినీ అవకాశాలు వరిస్తున్నాయి. ఇటీవల క్రిస్టీతో అలరించిన ఈ బ్యూటి చియాన్ విక్రమ్ తంగలాన్ (Thangalaan) మూవీతో రెడీ అయింది. ఇందులో ఆమె మేకోవర్ డిఫరెంట్ గా అట్రాక్ట్ చేసేలా ఉంది.

Malavika Mohanan

పింక్ కలర్ టాప్: సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో అదిరిపోయే గ్లామర్ షోతో నిత్యం కవ్విస్తుంటుంది మాళవిక మోహనన్. తాజాగా పింక్ కలర్ టాప్, బ్లూ కలర్ షార్ట్ జీన్స్ వేసుకుని రోడ్డుపైనే పరువాల విందు చేసింది. తాజా ఫొటోల్లో మాళవిక మోహనన్ అందాలు చూస్తుంటే మెంటలెక్కిపోయేలా ఉన్నాయి. అందుకే అవి అతి తక్కువ సమయంలో వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X