హాట్ ఫోటోషూట్‌తో సెగలు రేపిన మాళవిక మోహనన్.. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్.. వైరల్‌గా ఫోటోలు
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అందం, అభినయంతో మెప్పిస్తూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకొన్న హీరోయిన్ మాళవిక మోహనన్. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ. తన ప్రతిభతోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, లేటేస్ట్‌గా ఆమె ఫోటోషూట్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. మాళవిక మోహనన్ వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..

బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కూతురుగా
దక్షిణాదిలో బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా పేరొందిన కేయూ మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్. 2013లో మలయాళ చిత్రం పట్టమ్ పోలే చిత్రం ద్వారా దుల్కన్ సల్మాన్ సరసన నటించింది. ఆ తర్వాత కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది.
బికినీ అందాలు.. ఔరా అనిపిస్తోన్న నైరా బెనర్జీ

మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో
మలయాళంలో నిర్ణాయకం, ది గ్రేట్ ఫాదర్ లాంటి చిత్రాల్లో, కన్నడంలో నన్ను మట్టు వరలక్ష్మి, తమిళంలో పేట్టా, మాస్టర్ చిత్రాల్లో నటించింది. అలాగే ఇంకా పేరు పెట్టని కార్తీక్ నరేన్ చిత్రంలో నటిస్తున్నది. హిందీలో బియాండ్ ది క్లౌడ్స్ చిత్రంలో నటించింది.

విజయ్ దేవరకొండతో మూవీ
ఇక తెలుగులో ఇప్పటి వరకు ఇంకా అడుగుపెట్టలేదు. విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకు ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.

మహేష్ బాబుతో నటించాలనే కోరికతో
ఇక మాళవిక మోహనన్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూ ఆఫర్లను అందుకొంటున్నారు. మాస్టర్ చిత్రంలో ఇళయ దళపతి విజయ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేశారు. అయితే తనకు మహేష్ బాబుతో కలిసి నటించాలనే కోరికను బయటపెట్టారు.


Click it and Unblock the Notifications











