ఆ స్టార్‌ హీరోయిన్‌కు డైలాగ్స్ రావు.. రాజాసాబ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ఆధిపత్య పోరు సహజమే. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఇది కొనసాగుతూనే ఉంది. మాటా మాటా అనుకోవడం, ఇగోలు, ఇతర కారణాలతో నటీనటులు తమ కో స్టార్స్‌తో వైరం పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న వివాదాలతో దశాబ్ధాల పాటు మాట్లాడుకోని వారు చిత్ర పరిశ్రమలో ఎందరో ఉన్నారు. ఇక కొందరు మాత్రం తమ సహనటులపై ఇంటర్వ్యూలలో సీరియస్‌గా కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా పాన్ స్టార్ ప్రభాస్ సరసన ది రాజా సాబ్ మూవీలో హీరోయిన్‌గా నటించిన మాళవిక మోహనన్ ఓ స్టారో హీరోయిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నయనతారతో వివాదం
విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు మాళవిక మోహనన్. తమిళ్, మలయాళ భాషల్లో పలు హిట్ చిత్రాలలో నటించిన ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ ముందుంటున్నారు. ఏ విషయంపై అయినా ఉన్నది ఉన్నట్లుగా కామెంట్ చేసే మనస్తత్వం కావడంతో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్దినెలల క్రితం లేడీ సూపర్‌స్టార్ నయనతారకు, మాళవికకు మధ్య నడిచిన వివాదం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అది ఎంతలా అంటే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా.

Malavika Mohanan s Shocking Comments Spark Fresh Controversy With actresses in South Film Industry

మేకప్‌తో అలాంటి సీన్లు చేస్తారా?
నయనతార లేడీ సూపర్‌స్టార్ అని పిలవడం తనకు నచ్చదని.. సూపర్‌ స్టార్ అంటే సరిపోతుందని, ప్రత్యేకించి లేడీ సూపర్‌స్టార్ అని పిలవాల్సిన అవసరం లేదు. దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, అలియా భట్ తదితర హీరోయిన్లను సూపర్‌ స్టార్స్ అంటారు తప్పించి ప్రత్యేకంగా లేడీ సూపర్‌స్టార్ అని పిలవరని వ్యాఖ్యానించింది. ఇదే కాదు.. గతంలో ఓ సినిమాలో నయన్ నటనపైనా ఘాటు వ్యాఖ్యాలు చేసింది మాళవిక. ఓ చిత్రంలో హాస్పిటల్ బెడ్‌పై జరిగే సీన్‌లో ఓ స్టార్ హీరోయిన్ ఫుల్ మేకప్ వేసుకుంది, జుట్టు కూడా చెదరలేదు. ఆ సీన్ అంత రియలిస్టిక్‌గా లేదని పరోక్షంగా లేడీ సూపర్‌స్టార్‌పై కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

మాళవికకు నయనతార కౌంటర్
దీనిపై సోషల్ మీడియాలో మాళవికపై నయనతార అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగారు. అటు నయనతార కూడా ఓ ఇంటర్వ్యూలో మాళవికకు కౌంటర్ ఇచ్చింది. ఓ హీరోయిన్ నన్ను ఆసుపత్రిలో బెడ్‌పై మేకప్ వేసుకున్నానని విమర్శించింది. కానీ దర్శకులకు ఏం కావాలో తెలియదా అంటూ మండిపడింది నయనతార. తర్వాత ఈ వివాదం నెమ్మదిగా సద్దుమణిగింది. తాజాగా నయనతారపై తన అక్కసును మరోసారి బయటపెట్టింది మాళవిక మోహనన్. ఈ వివరాల్లోకి వెళితే..

1, 2, 3, 4 లెక్క పెడతారు
ఇటీవల గలాటా ప్లస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోని చాలామంది నటీమణులు షూటింగ్ సమయంలో తమ డైలాగ్‌లను గుర్తుంచుకోవడం లేదా చదవడం కూడా పట్టించుకోరు. దీనికి బదులుగా 1, 2, 3, 4 లేదా A, B, C, D‌లను చెబుతారు. తర్వాత డబ్బింగ్ సమయంలో డైలాగ్స్‌ను సరిదిద్దుకుంటారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలలో చాలాకాలంగా తమ డైలాగ్‌లను కనీసం చూసుకోవడానికి కూడా ఇష్టపడని చాలామంది నటీమణులు నాకు తెలుసు. ఒక సన్నివేశంలో విషాదకరమైన సన్నివేశం చేయాల్సి వస్తే.. బాధగా ముఖం పెట్టి 1, 2, 3, 4 అని లెక్కపెడతారు.. లేదంటే A, B, C, D అని చెబుతారు. కోపంగా ఉన్న సీన్ చేయాల్సి వచ్చిన్పపుడు కూడా అంతే. తర్వాత డబ్బింగ్ సమయంలో డైలాగ్‌లకు అనుగుణంగా పెదవుల కదిలికలను సరిచేస్తారు. ఏదో ఒకటి రెండు సార్లు కాదు.. కెరీర్ మొత్తం ఇలాగే చేసిన నటీనటులు ఉన్నారని మాళవిక వ్యాఖ్యానించారు.

మాళవికపై ట్రోలింగ్
మాళవిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోని నటీనటుల పనిని కొందరు తక్కువ చేసి చెబుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే బహుభాషా చిత్రాలలో నటిస్తోన్న నయనతార, త్రిష తదితర నటీమణులను ఉద్దేశించే మాళవిక చేశారని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇదే సమయంలో ది రాజాసాబ్‌లో మాళవిక నటనపైనా కొందరు విమర్శలు చేస్తున్నారు. మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X