ఎంత పొడవుగా ఉన్నా నచ్చదంట. బోల్డ్ బ్యూటీ హాట్ కామెంట్స్..
ఇప్పుడు మారుతున్న ట్రెండ్ లో సౌత్ ఇండియా సినిమా నుంచి హీరోయిన్స్ నార్త్ మార్కెట్ లో పాగా వెయ్యాలని చూస్తుంటే నార్త్ ఇండియా హిట్ బ్యూటీస్ సౌత్ మార్కెట్ ని సీరియస్ గా తీసుకొని తమ సినిమాలు ఇక్కడ రిలీజ్ తీసుకొస్తున్నారు. అలాగే తెలుగులో హిందీ హీరోయిన్స్ కూడా పలు సినిమాల్లో హీరోయిన్స్ గా ఓకే చేస్తూ వస్తున్నారు.
రీసెంట్ గానే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ "దేవర" తో తెలుగు సహా సౌత్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తే మరి సౌత్ నుంచి కూడా ఓ బోల్డ్ బ్యూటీ హిందీ అండ్ నార్త్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. కాగా ఆ హీరోయిన్ ఎవరో కూడా కాదు తన బోల్డ్ అండ్ హాట్ షోతో హీట్ ని పెంచేసే తమిళ బ్యూటీ మాళవిక మోహనం. ఈ మధ్య మాళవిక మోహనన్ ఫుల్ స్వింగ్ లో ఉంది.

తమిళ్ లో నటించిన భారీ చిత్రం 'తంగలాన్' తో తనలో హాట్ యాంగిల్ మాత్రమే కాకుండా సాలిడ్ పెర్ఫార్మర్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది.ఇక ఈ సినిమా తర్వాత హిందీలో "యుద్రా" అనే సినిమా రిలీజ్ కి వచ్చింది. అయితే ఇందులో క్రేజీ హాట్ షోతో రెచ్చిపోయిన మాళవిక అక్కడ కొన్ని ప్రెస్ మీట్స్ లో కూడా తన అంద చందాలతో హైలైట్ గా కనిపించింది.
సరే ఇదంతా బాగానే ఉంది కానీ అసలు హీరోయిన్స్ విషయంలో వారి ఫిజిక్ పరంగా నార్త్ మార్కెట్ లో సౌత్ సినిమా మార్కెట్ లో ఎలా ఫీల్ అవుతారో రివీల్ చేసింది. ఉత్తరాది సినిమా దగ్గర హీరోయిన్స్ ఎంత ఫిట్ గా ఉన్నా పొడవుగా ఉన్నప్పటికీ అక్కడ అందంగానే పరిగణిస్తారు కానీ తెలుగు, హిందీ మార్కెట్ లలో మాత్రం నేను ఏమాత్రం బరువు తగ్గి కొంచెం సన్నబడినా మీరు ఇలా కూడా బాగానే ఉన్నారు కానీ ముందు బొద్దుగా ఉన్నపుడే మరింత బాగుండేవారు అని అంటరాని ఆమె ఓ నేషనల్ మీడియాకి తెలిపినట్టు తెలుస్తుంది.
దీనితో హీరోయిన్స్ విషయంలో నార్త్ మార్కెట్ లో అలాగే తమిళ్, తెలుగు సినిమా వారు ఎలా వ్యత్యాసం చూపిస్తారో అనేది ఆమె రివీల్ చేసింది. దీనితో తన ఈ హాట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. అంటే మన దగ్గర హీరోయిన్స్ ని కొంచెం ఒళ్ళుగా ఉంటేనే ఇష్టపడతారు అన్నట్టుగా ఆమెకి జరిగిన అనుభవాన్ని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక ఇది పక్కన పెడితే హాట్ బ్యూటీ ప్రస్తుతం తమిళ్, తెలుగు భాషల్లో బిజీగా ఉంది. మన తెలుగులో అయితే పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న క్రేజీ హారర్ ఎంటర్టైనర్ చిత్రం "ది రాజా సాబ్" లో నటిస్తుండగా ఈ సినిమాతో ఈమె తెలుగు ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే ఈ సినిమాని మారుతీ దర్శకత్వం వహిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో పాన్ ఇండియా విడుదలకి ఈ చిత్రంని తీసుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











