twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Malavika Mohanan: రెడ్​ టాప్​లో మాళవిక మోహనన్​ ఘాటు అందాలు.. ఇలా అయితే ఎలా మాస్టారు!

    |

    ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ కె.యు మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది బ్యూటిఫుల్​ హీరోయిన్​ మాళవిక మోహనన్. 2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ నటించిన పేట మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం విజయ్ సరసన మాస్టర్​లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ భామ అప్పుడప్పుడు సోషల్​ మీడియాలో హాట్​ పిక్స్ పెడుతూ హీట్​ పెంచుతోంది.

    మాళవిక మోహనన్​ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సూపర్ స్టార్​ రజనీ కాంత్ నటించి పేటా మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది మాళవిక మోహనన్. అనంతరం విజయ్​ సరసన నటించిన మాస్టర్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

     ధనుష్​తో మారన్​ మూవీలో..

    ధనుష్​తో మారన్​ మూవీలో..

    తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్​ ఉన్న ధనుష్​ సరసన నటించింది. ధనుష్, మాళవిక మోహనన్​ జంటగా నటించిన మారన్​ మూవీకి అంతగా హిట్​ టాక్​ రాలేదు.

    ఇంటిమేట్​ సీన్ గురించి..

    ఇంటిమేట్​ సీన్ గురించి..

    కానీ, ఇందులో ఆమె నటించిన ఇంటిమేట్ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ఆమె ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఆస్క్​ మీ సెషన్​ నిర్వహించింది. అందులో ఓ నెటిజన్​ ఈ ఇంటిమేట్ సీన్ గురించి అడిగిన విధానం చూస్తే అలానే అనిపిస్తుంది.

    స్ట్రాంగ్​ రిప్లై..

    స్ట్రాంగ్​ రిప్లై..

    ఆస్క్​ మీ సెషన్​లో మారన్​ మూవీలో బెడ్​ సీన్​ కోసం ఎన్నిసార్లు షూట్​ చేశారు అని మాళవిక మోహనన్​ ఓ నెటిజన్ అడిగాడు. అందుకు ఆమె దీటుగా ఆన్సర్​ ఇచ్చింది. నీ తలలో ఏదో పాడైనట్టుంది. అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే విధంగా గట్టి కౌంటర్​ ఇచ్చింది.

     ఆమె బయోపిక్​లో నటించాలని..

    ఆమె బయోపిక్​లో నటించాలని..

    అలాగే మాళవిక మోహనన్​కు బాలీవుడ్​ సీనియర్​ అండ్​ బ్యూటిఫుల్​ హీరోయిన్​ ఐశ్వర్యరాయ్ బయోపిక్​లో నటించాలని ఉందని సోషల్​ మీడియా వేదికగా బయటపెట్టింది. అలాగే తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందన్న ప్రశ్నకు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ పేరు చెప్పింది ఈ బ్యూటీ.

     ఓ సినిమా చేయాల్సి ఉంది..

    ఓ సినిమా చేయాల్సి ఉంది..

    విజయ్​ దేవరకొండతో రొమాంటిక్​ కామెడీ గానీ, లేదా పూర్తి రొమాంటిక్ జోనర్​లో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపింది మాళవిక మోహనన్. అయితే వీరిద్దరి కాంబినేషన్​లో ఓ సినిమా చేయాల్సి ఉంది. హీరో పేరుతో ప్రారంభమైన ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

    తెలియని కారణాలు..

    తెలియని కారణాలు..

    అనంతరం కొంతమేర షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. అందుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మాళవిక సోషల్​ మీడియాలో తన అందాలను హాట్​హాట్​గా ప్రదర్శిస్తూ యూత్​ను కట్టిపడేస్తుంది.

     హీటెక్కిస్తున్న పిక్స్​..

    హీటెక్కిస్తున్న పిక్స్​..

    తాజాగా రెడ్​ టాప్ డ్రెస్​లో మాళవిక ప్రదర్శించిన అందాలు సోషల్​ మీడియాను హీటెక్కిస్తున్నాయి. పోస్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఆ పిక్స్​ తెగ వైరల్​ అయ్యాయి. కాగా, మాళవిక మోహనన్​ గతంలో బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​తో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

    English summary
    Mollywood Beautiful Heroine Malavika Mohanan Latest Sizzling Glamour Photos In Red Top Going Trend in Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X