ఆ అసభ్య ఫోటో నాది కాదు.. మార్ఫింగ్ చేశారు.. ఆ మాత్రం చూడరా.. మాళవిక మోహనన్ ఆవేదన!
నటి మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె దళపతి విజయ్ 'మాస్టర్'లో కథానాయికగా నటించింది. మాళవిక మోహనన్ ఇన్‌స్టాగ్రామ్ మరియు సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్. ఆమె తన ఫోటోషూట్ చిత్రాలతో తరచుగా ట్రెండింగ్ అవుతుంది. అయితే తన మార్ఫ్హింగ్ ఫోటో వాడినందుకు ఆమె ఒక వెబ్ సైట్ మీద విరుచుకు పడింది. ఆ వివరాలు

మోహనన్ కుమార్తె
మలయాళ భామ మాళవిక మోహన్ తెలుగులో నేరుగా సినిమాలు చేయక పోయినా తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె అయిన మాళవిక ముంబైలో జన్మించారు. ఆమె కుటుంబం కేరళకు చెందినదే అయినా ఆమె ముంబైలో జన్మించడంతో పాటు తన తండ్రి తో పాటు సినిమాటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకుంది.

వరుస సినిమాల్లో
మమ్ముట్టి చేస్తున్న ఒక ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ కోసం ఆమె కూడా తండ్రితో పాటు పని చేస్తున్న సమయంలో మమ్ముట్టి తన కుమారుడు సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. మలయాళంలో నిర్ణాయకం, ది గ్రేట్ ఫాదర్ లాంటి చిత్రాల్లో, కన్నడంలో నన్ను మట్టు వరలక్ష్మి, తమిళంలో పెట్టా, మాస్టర్ చిత్రాల్లో నటించింది.
బాధాకరం
అయితే, ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రచురించిన తన ఫోటోతో మాళవిక మోహనన్ షాక్ అయ్యింది. మీడియా సంస్థ ఒక వార్తా కథనంలో తన నకిలీ మరియు ఫోటోషాప్ చిత్రాన్ని ఉపయోగించిందని ఆమె ఆరోపించారు. ఈ కథనం నటికి నచ్చకపోవడంతో ఆమె తన సోషల్ మీడియాలో పోర్టల్‌పై దుమ్మెత్తిపోసింది. సోషల్ మీడియా మైలేజ్ కోసం ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఇలాంటి ప్రముఖ మీడియా హౌస్ ఫేక్ ఫోటోషాప్ చేసిన అసభ్యకరమైన ఫోటోలను వాడడం బాధాకరం అని ఆమె పేర్కొంది.

సినిమాల విషయానికి వస్తే
ఎడమవైపు ఉన్న ఫోటో ఫేక్ ఫోటోషాప్ చేసిన వల్గర్ ఫోటో. ఇది నిజమైన ఫోటోనా కాదా అని తనిఖీ చేయకుండా మీడియా సంస్థ దానిని ఎలా ప్రసారం చేసుంటి ! "అని మాళవిక మోహనన్ మీడియా హౌస్‌ని ఉద్దేశించి పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మాళవిక యొక్క చిత్రాలు మరియు రీల్స్ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అవుతాయి. మాళవిక మోహనన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ధనుష్ యొక్క మారన్ అలాగే హిందీలోని యుధ్రాలో కూడా భాగం అవనుంది.

విజయ్ దేవరకొండతో
అయితే ఆమె నేరుగా తెలుగులో ఇప్పటి వరకు ఇంకా అడుగుపెట్టలేదు. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకు ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా ప్రస్తుతానికి అయితే ఆగి పోయింది. అన్ని పరిస్థితులు కుదుటపడ్డాక ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











