లెజెండరీ స్పోర్ట్స్‌మెన్ జీవిత చరిత్రపై మనసుపడ్డ మాళవిక ఆ బయోపిక్ ఎవరిదో తెలుసా?
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. మరి నార్త్ నుంచి సౌత్ నుంచి కూడా చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా ఈ హీరోయిన్స్ లో తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ కూడా ఒకామె.. మరి మాళవిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ షోతో ట్రెండింగ్ లో కనిపిస్తూ ఉంటుంది.
కానీ తాజాగా ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ తో అయితే ఈ హాట్ బ్యూటీ మరోసారి సౌత్ సినిమా వర్గాల్లో వైరల్ గా మారింది. లేటెస్ట్ గా మాళవిక సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవ్వగా అందులో ఆమె చాలా మందికి సమాధానాలు పలు ఆసక్తికర ప్రశ్నలకి అందించింది. కాగా వీటిలో ఆమె బోల్డ్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధమే ఎలాంటి ఇబ్బంది లేదు ఏవైనా చేసి సూపర్ స్టార్ గా నిలిచిపోవాలి అనుకుంటున్నా అని చెప్పింది.

కాగా దీనితో పాటుగా మరో ఆసక్తికర ప్రశ్నకి ఆమె సమాధానం చెప్పింది. మామూలుగా ఏ హీరోకి అయినా హీరోయిన్ కి అయినా కూడా కొన్ని డ్రీం రోల్స్ లాంటివి ఇలాంటి సినిమాలు చేయాలి అని మనసులో ఒక్క సినిమా లేదా ఒక్క జానర్ అయినా ఉంటుంది. అలా మాళవిక మోహనన్ ఒక స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయాలని ఉందని మనసులో మాట చెప్పింది.
తనకి ఎప్పటి నుంచో ఉన్న కల ఇది ఇండియన్ అథ్లెట్ ఒలింపిక్ రన్నింగ్ ఛాంపియన్, పిటి ఉష బయోపిక్ ని చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న నా కల అది అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను కూడా తన యుక్త వయసులో ఒక ట్రాక్ రన్నర్ ని అని పిటి ఉష గారు నా జీవితాన్ని ఎంతగానో ప్రేరేపించారు అని ఆమె బయోపిక్ తప్పకుండా చేస్తాను అని ఒక ఊహించని సమాధానంగా తన డ్రీం ప్రాజెక్ట్ కోసం అందించింది.

మరి మాళవిక నుంచి ఈ క్రేజీ స్పోర్ట్స్ డ్రామా ఎపుడు ఎలా పడుతుందో చూడాలి. మన ఇండియన్ సినిమా దగ్గర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలకి మంచి ఆదరణ ఉంది. స్పోర్ట్ ఏదైనా కూడా చాలా వరకు సినిమాలు మంచి సక్సెస్ రేట్ ని చూశాయి. అంతెందుకు ఇండియన్ సినిమా హైయెస్ట్ గ్రాసర్ 2000 వేల కోట్లకి పైగా వసూలు చేసిన సినిమా "దంగల్" కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమానే.
ఇంకా క్రికెట్ లో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన "ఎం ఎస్ ధోని", ఫుట్ బాల్ లో అజయ్ దేవగన్ నటించిన "మైదాన్", హాకీ లో షారుఖ్ ఖాన్ నటించిన "చక్ దే" ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా సినిమాలు రియల్ బయోపిక్ గా చేసి అదరగొట్టినవి ఉన్నవి ఉన్నాయి. మరి వీటిలో రన్నింగ్ బ్యాక్ డ్రాప్ లో మాళవిక నుంచి ఎమోషనల్ సినిమా ఏమన్నా వస్తుందేమో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











