Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్టీఆర్ బయోపిక్‌లో మరో యంగ్ హీరోయిన్!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం మొత్తం స్టార్స్ తో నిండిపోతుంది. ఈ చిత్రాల్లో చాలామంది ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు పాత్రలో దగ్గుబాటి రానా, ఏఎన్నార్ పాత్రలో హీరో సుమంత్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి పాత్రలో, నిత్యామీనన్ సావిత్రి పాత్రలో మెరవబోతున్నారు. తాజగా మరో యంగ్ హీరోయిన్ కూడా ఈ చిత్రంలో భాగం కాబోతోంది. అలాంటి నటి కృష్ణ కుమారి పాత్ర కోసం మలయాళీ బ్యూటీ మాళవిక నైర్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, కృష్ణ కుమారి కలసి పలు చిత్రాల్లో నటించారు. అప్పట్లో కృష్ణ కుమారి దేవతల పాత్రలతో బాగా పాపులర్ అయ్యారు.
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని విడుదల చేయనున్నారు.