Don't Miss!
- News
sister: శాడిస్టు సిస్టర్, కోట్ల రూపాయల ఆస్తి, అన్నను కిడ్నాప్ చేసి ఏం చేసిందంటే?, ఆంటీ కొడుకు!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అయ్యో పాపం మాళవిక! ఎంజాయ్ చేసింది.. కానీ బుక్కైపోయిందా..?
సోషల్ మీడియా ప్రభావం నానాటికీ బాగా విస్తరిస్తోంది. ఒకరకంగా ఇది టెక్నాలజీకి పెద్ద పీటే అయినప్పటీకీ సెలెబ్రిటీలను మాత్రం ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ మాద్యకాలంలో ట్రోలింగ్ చేయడమనేది సర్వసాధారణం అయిపోయింది. ఏ చిన్న అవకాశం దొరికినా అస్సలు ఊరుకోవడం లేదు నెటిజన్లు. స్వేచ్ఛగా తమ తమ కామెంట్లు పెడుతూ ట్రోలింగ్ కి పాల్పడుతున్నారు. తాజాగా హీరోయిన్ మాళవిక శర్మకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఇటీవలే వెకేషన్ టూర్ వేసిన మాళవిక శర్మ థాయిలాండ్ వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదించింది. ఈ మేరకు అక్కడి విశేషాలను, ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మాళవిక. వెకేషన్‌లో భాగంగా అక్కడి పట్టాయా అనే టైగర్ జూకు వెళ్లి పులులతో కలిసి అలా అలా హాట్ పోజులిచ్చించి. పైగా ఈ ఫొటోలని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ''థాయిలాండ్ దేశంలోని పట్టాయా అనే టైగర్ పార్క్‌కి ఓ ప్రత్యేకత ఉంది. అందులోని పులులు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి. క్రూర మృగాలైనప్పటికీ మనుషులపై ప్రేమను కురిపిస్తాయి. వాటికి చిన్నప్పటి నుంచి మనుషులతో కలసిమెలసి తిరగడం నేర్పుతారు. అందుకే అవి మనుషులతో స్నేహంగా ఉంటాయి. మీరెప్పుడైనా థాయిలాండ్ వెళ్తే పట్టాయా టైగర్ పార్క్ కి ఖచ్చితంగా వెళ్లండి. ఆ పార్క్‌లో పూలతో ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. అవి అందమైనవే కాదు కొంటెవి కూడా'' అని పేర్కొంది.

థాయిలాండ్ లో ఎంజాయ్ చేసింది.. ఆ సరదాలను ఇలా సోషల్ మీడియాలో పంచుకుంది మాళవిక. ఈ పిక్స్ చూసి ఆహా.. ఓహో! అంటారని అనుకుందేమో కానీ ఊహించని విధంగా ట్రోల్స్ బారిన పడతానని మాత్రం అనుకోలేదు కావచ్చు. పులులతో ఇలా మాళవిక పోజులివ్వడాన్ని కొందరు జంతు ప్రేమికులు తప్పు బడుతున్నారు. ''ఆ పులులకు డ్రగ్స్ ఇస్తారు. లేకపోతే క్రూర మృగమైన పులి అలా ఉండదు, నువ్వు చేసింది జంతు హింస అవుతుంది. పైగా ఇదేదో ఘనకార్యం అన్నట్టు ఫోటోలు షేర్ చేస్తున్నావు" అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. పాపం ఇలా ఎరక్కపోయి షేర్ చేసి ఇరుక్కుపోయింది మాళవిక.
రవితేజ సరసన నేల టిక్కెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాళవిక శర్మ.. అందంతో ఆకట్టుకున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టలేక పోయింది. పోనీ సోషల్ మీడియా ద్వారా అయినా మెల్లగా ఫేం అవుదాం అనుకుంటే ఇదిగో ఇలా విమర్శల పాలైంది.