అందంతో చెక్కిన శిల్పంలా మాస్టర్ బ్యూటీ.. మాళవిక మోహనన్ అందాల ఆరబోత ఈ రేంజ్‌లోనా?

మాళవిక మోహనన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ KU మోహనన్ కుమార్తెగా మలయాళ చలనచిత్ర ప్రపంచంలోకి అడుగుపెట్టింది. చిన్న వయస్సునుంచే మోడలింగ్ రంగంలో మెళుకువలు నేర్చుకున్న ఈ చిన్నది.. 2013 మలయాళ చిత్రం పట్టం బోలే అనే చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమాలో లో పూంగోడి పాత్రలో నటించి తమిళ అభిమానులలో మంచి ఆదరణ సంపాదించడమే కాకుండా మాస్టర్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.

ఇక ఈ సినిమాతో మాళవిక మంచి విజయాన్ని అందుకుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అమ్మడికి వరుస అవకాశాలను కూడా తీసుకొచ్చిపెట్టింది. దీని తర్వాత ధనుష్ సరసన మారన్ లో నటించింది.నిజం చెప్పాలంటే మాళవికాకు అవకాశాలు తక్కువగానే వస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. కానీ, ఛాన్స్ లు మాత్రం అందుకోలేకపోతుంది. ఛాన్సెస్ కోసం మాళవిక అందాల ఆరబోస్తూ తాను దేనికైనా రెడీ అంటూ చెప్పకనే చెప్పుకొస్తుంది.

Malavika strikes a series of sensuous poses for the camera looking sizzling hot in every frame

ఇక మాళవిక సినిమాలను పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందాలను ఆరబోయడంలో మాళవిక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. అకేషన్ ఏదైనా.. లొకేషన్ చూసి మరీ అందాలను ఆరబోసాయడం అమ్మడు పట్టా పుచ్చుకుంది. కుర్రాళ్ల పల్స్ నాకు తెలుసు అన్నట్లు అయితే ఎద అందాలను, లేకపోతే థైస్ అందాలను.. అది కుదరకపోతే నడుము మడతలను ఎరగా వేసి కుర్రాళ్లకు కునుకే లేకుండా చేస్తుంది. ఈ గ్లామర్ ట్రీట్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అంతలా ఈ చిన్నదాని ఫోటోషూట్స్ ఉంటాయి.

తాజాగా మాళవిక మమరోసారి తన అందాలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కించింది. అదిరిపోయే క్రీం కలర్ డ్రెస్ లో వంపులను వయ్యారంగా తిప్పుతూ చూపరులను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. చెక్కిన శిల్పంలా అమ్మడి వంపుసొంపులు మతిపోగొడుతున్నాయని చెప్పొచ్చు. ఇక అన్నటికన్నా కత్తిలాంటి చూపులు సూటిగా గుండెలను గుచ్చుతున్నట్లు ఉన్నాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సూపర్, అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం మాళవిక రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంది. ఒకటి విక్రమ్ హీరోగా తెరకెక్కిన తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్ సరసన డీ గ్లామర్ పాత్రలో ఆమె నటించింది. ఈ సినిమా రిలీజ్ కు నోచుకోలేకపోతుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇది కాకుండా తెలుగులో ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలో నటిస్తుంది. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపైనే అమ్మడు ఆశలన్నీ పెట్టుకుంది. మరి ఈ రెండు సినిమాలతో మాళవిక ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X