ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోతో పెళ్లికి రెడీ అయిన విజయ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
భాషా భేదం లేకుండా దాదాపు అన్ని పరిశ్రమలకు చెందిన హీరోలు హీరోయిన్లు పెళ్లిళ్ల బాటపడుతున్నారు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది హీరోయిన్లు కూడా వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోబోతున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె తెలుగు హీరోయిన్ కాదు కానీ తెలుగు సినిమాల్లో కనిపించడానికి సిద్ధమవుతోంది. ఆమె ఇంకెవరో కాదు అపర్ణ దాస్ ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతోందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మలయాళ నటి అపర్ణా దాస్, నటుడు దీపక్ పరంబోల్ పెళ్లి చేసుకోనున్నారు. ఏప్రిల్ 24న వడకంచెరిలో వివాహం జరగనున్నది. వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. 'నా ప్రకాశనం' సినిమాతో నటరంగంలోకి అడుగుపెట్టిన అపర్ణ.. 'మనోహరం' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో అపర్ణతో పాటు దీపక్ పరంబోల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు.

దళపతి విజయ్ బీస్ట్ ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అపర్ణ గతేడాది విడుదలైన తమిళ చిత్రం 'దాదా'లో కథానాయికగా అద్భుతమైన నటనను కనబరిచింది. అంతేకాదు వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'తో తెలుగులోకి కూడా ఆమె ఎంట్రీ ఇచ్చారు. సీక్రెట్ హోమ్ అనే సినిమా ఆమె హీరోయిన్ గా నటించగా విడుదలైన చివరి సినిమా.
ఇక దీపక్ పరంబోల్ విషయానికి వస్తె వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో 'మలర్వాడి ఆర్ట్స్ క్లబ్' సినిమాతో తెరంగేట్రం చేసి ది గ్రేట్ ఫాదర్', 'తట్టతిన్ మరాయత్', 'కుంజిరామాయణం', 'కెప్టెన్', 'కన్నూర్ స్క్వాడ్' వంటి చిత్రాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇండస్ట్రీ హిట్ అయిన 'మంజుమ్మల్ బాయ్స్'లో కూడా పరంబొల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు.

అంతే కాదు వినీత్ హీరోగా తెరకెక్కుతున్న 'వరాశం శేష' చిత్రంలో కూడా దీపక్ నటిస్తున్నాడు. ఇక మనోహరం చిత్రంలో దీపక్, అపర్ణ కలిసి నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం చాలా కాలం పాటు కొనసాగి ప్రేమకు దారి తీసినట్లుగా చెబుతున్నారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని సమాచారం. వడకంచెరిలో జరిగే వివాహ వేడుకకు ఇరువురి దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం.
నిజానికి ఆమె మలయాళ తమిళ సినిమాలలో ఎక్కువగా హీరోయిన్ పాత్రలలోనే కనిపించింది కానీ తెలుగు సినిమాలో మాత్రం హీరోకి సోదరి పాత్రలో కనిపించింది వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ అనే సినిమాలో వైష్ణవి సోదరి పాత్రలో ఆమె కనిపించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











