జీవితంలో అసలు పెళ్లి చేసుకోను.. మెగా హీరోయిన్ సంచలన నిర్ణయం.. కారణం అతడేనా?
జీవితమంటే చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు అనేలా సాగేది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడ్డ.. జీవితంలో వెల్ సెట్ అయిన పెళ్లి గురించి నేటి యువత ఆలోచించడం లేదు. ప్రస్తుతం జీవన విధానం, ఉద్యోగాల ప్రభావం వల్ల చాలా మంది ఇండిపెండెంట్ గా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయిలు.. అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోతున్నారు. ఇలాంటి వాళ్లల్లో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకుంటే తమ కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందని, పెళ్లిళ్లకు దూరంగా ఉన్నవారు కొందరైతే.. తాము జీవితంలో పెళ్లి చేసుకోమంటూ స్టేట్మెంట్ ఇచ్చేవారు మరికొందరు. అలా తాను జీవితంలో పెళ్లి చేసుకోనంటూ యంగ్ హీరోయిన్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మలయాళం హీరోయిన్ ఐశ్వర్య లక్ష‍్మి (Aishwarya Lekshmi) ఈ అమ్మడు మలయాళంలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తోన్న 'SD18' మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది ఐశ్వర్య. ఈ సినిమాకు సంబంధించిన అదికారిక ప్రకటన కూడా వచ్చేంది. మూవీపై హైప్స్ క్రియేట్ అయ్యేలా పోస్టర్ ను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఐశ్వర్య లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేసింది. చిన్నతనంలో తాను పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కన్నానని, కానీ పెద్దాయాక తన ఆలోచన విధానం మారిందని, తన దృక్పథంలో మార్పు వచ్చిందని చెప్పారు. తన చుట్టూ ఉన్న వారు తమ బంధాల కోసం రాజీ పడి జీవిస్తున్నట్లు తాను గమనించానని తెలిపారు. తాను చూసిన వారిలో పెళ్లి చేసుకున్న వారు సంతోషంగా లేరని, వారు రాజీ పడి జీవిస్తున్నారని తన కనిపించిందని ఐశ్వర్య తెలిపారు. దీంతో తాను జీవితంలో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నానని, అయితే ఈ నిర్ణయానికి తాను తేలికగా తీసుకోలేదని , అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి.
తనకు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదని, ఇది భావోద్వేగా పూరితమైన ఎంపిక కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు ఐశ్వర్య లక్ష్మి. తన చుట్టూ ఉన్న వారిలో ఎన్నో విషయాలను తాను గమనించాననీ, పెళ్లి చేసుకున్నా తర్వాత వారు తమ ఐడెంటిటీని కోల్పోతున్నారని తెలిపారు. ఆ సమయంలోనే జీవితంలో వివాహం అనేది అవసరమా అని తనకు తానే ప్రశ్నించుకున్నారని తెలిపారు.

కొన్ని సంవత్సరాల ముందు కూడా పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చిందని, ఆ సమయంలో ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తన ప్రొఫైల్ ను పెట్టానని తెలిపారు కానీ చాలామంది అది ఫేక్ ప్రొఫైల్ అని తనని రిజెక్ట్ చేశారని, పెళ్లిపై తన అభిప్రాయం మారడంతో ప్రొఫైల్ ను డిలీట్ చేశానని తెలిపారు. ఈ కామెంట్స్ తో తన అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడుతో ఆమె ప్రేమలో ఉందని గత కొంతకాలంగా రూమర్స్ వస్తున్నాయి అయితే .. ప్రస్తుతం ఐశ్వర్య మాటలతో.. అదంతా పుకార్లేనని వెళ్లడవుతుంది. మీరు ఏమైనా పెళ్లిపై ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఐశ్వర్య లక్ష్మి.


Click it and Unblock the Notifications











