23 ఏళ్ల వయసులోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్... ఈ పాప ఎవరో గుర్తు పట్టారా?

ఫోటోలో కనిపిస్తున్న ఈ అందమైన చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రిలో సంచలన నటి. తాజాగా 100 కోట్ల సినిమా ఇచ్చి పాన్ ఇండియా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించింది. కేవలం 3 కోట్లతో సినిమా 100 కోట్లు రాబట్టింది. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

సెలబ్రిటీల ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే కొంతమంది పాపులర్ నటీనటుల చిన్నప్పటి ఫోటోలు, వీడియోలు కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఎంపథ్యంలోనే ఎక్కడ చూసినా ఈ యంగ్ హీరోయిన్ ఫోటోలు కన్పిస్తున్నాయి.

Malayalam Actress Mamitha Baiju Childhood Pics Goes Viral

ఈ హీరోయిన్ మరెవరో కాదు.. ప్రేమలు చిత్రంలో కథానాయికగా నటించి సౌత్ లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి మమితా బైజు. ప్రేమలు సినిమాలో మమిత నటనకు యూత్ ఫిదా అయ్యారు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది మమిత.

ఫిబ్రవరి 2024లో ఫిబ్రవరి 9న భారీ విజయాన్ని అందుకున్న ప్రేమలు చిత్రంలో తన అద్భుతమైన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను ఆకర్షించింది. అయితే ప్రేమలు కంటే ముందు ఆమె సూపర్ శరణ్యలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.

Malayalam Actress Mamitha Baiju Childhood Pics Goes Viral

ప్రస్తుతం ఆమె సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా, 23 ఏళ్లకే 100 కోట్ల మూవీని చేసిన హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది. కాగా నటి మమితా బైజు తన సోదరుడితో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోలను పస్తుతం ఆమె అభిమానులు షేర్ చేస్తుండడం విశేషం.

కేవలం రూ.3 కోట్లతో యువ నటీనటులతో రూపొందిన ప్రేమలు సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా ఈ చిత్రం 2024లో భారతదేశంలోనే అతిపెద్ద బ్లాక్‌ బస్టర్‌గా హిస్టరీని క్రియేట్ చేసింది. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా యూత్‌ మెప్పు పొందడమే కాకుండా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

Malayalam Actress Mamitha Baiju Childhood Pics Goes Viral

సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దుమ్మురేపిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను తెలుగులో కూడా ప్రేమలు పేరుతో దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ మార్చి 8న విడుదల చేశారు. తెలుగు వెర్షన్ కూడా హిట్ అయింది. ఈ సినిమా తమిళ వెర్షన్ కూడా గత వారం విడుదలైంది.

మలయాళంలో గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు మొదటి రోజు 9 లక్షలు, మొదటి వారం తర్వాత రూ. 12.6 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. మౌత్ టాక్ ఈ మూవీ విజయానికి ప్రధాన కారణం.

ముఖ్యంగా ఈ సినిమాలో కథానాయిక మమితా బైజు రీనూ పాత్రలో నటించి, తన నటనతో యూత్ హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ పాప యూత్‌కు ఫేవరెట్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X