‘మగాళ్లంటే నాకు టిష్యూ పేపర్‌తో సమానం.. వాళ్లతో గడపడమంటే పక్కా ఫూలిష్’

దక్షిణాదిలో గ్లామర్ ఫుల్ రోల్స్‌తో ఆకట్టుకొన్న నటి సోనా హైడెన్ మరోసారి వార్తల్లో నిలిచింది. చాలా కాలంగా మీడియాకు, సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ అందాల భామ తాజాగా దర్శక, నిర్మాతగా మారడమే కాకుండా నటిస్తూ స్మోక్ అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంచలన రీతిలో కామెంట్ చేశారు. కొందరు సినీ ప్రముఖులపై విమర్శలు, ఆరోపణలు చేయడంతో మళ్లీ మీడియా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. దాంతో ఎవరీ సోనా హైడెన్ అనే నెటిజన్లు వెతకడం ప్రారంభించారు. దాంతో ఆమె గతంలో చేసిన సెన్సేషనల్ విషయాలు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సోనా గురించిన వివరాల్లోకి వెళితే..

సోనా హైడెన్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ తలా అజిత్ నటించిన పూవెలమ్ ఉన్ వసంతం సినిమా ద్వారా ఆమె తన నట జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత మలయాళంతోపాటు పలు దక్షిణాది భాషల్లో నటించారు. 2000 నుంచి 2015 వరకు బిజీగా ఉంటూ పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో రాజశేఖర్‌తో కలిసి ఆయుధం, రవితేజతో కలిసి వీడే, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆంధ్రావాలా అనే చిత్రంలో నటించింది. అయితే తమిళం, మలయాళం చిత్రాల్లో భారీ ఆఫర్లు రావడంతో తెలుగు పరిశ్రమకు దూరమైంది.

Sona Heiden Throwback Story

గతంలో ఇంకా అవివాహితురాలిగానే ఉండటంపై ఆమె సోనా తన అభిప్రాయాలను ఆనంద వికటన్ అనే మ్యాగజైన్‌తో షేర్ చేసుకొన్నారు. మగాళ్లంటే నాకు టిష్యూ పేపర్‌తో సమానం. నాకు వైవాహిక వ్యవస్థపై నమ్మకం లేదు. పురుషులతో కలిసి జీవించడం పెద్ద ఫూలీష్ విషయం అంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై కొందరు తీవ్రంగా స్పందించారు. దాంతో ఆమెపై గతంలో వెల్లూరులో కేసు నమోదు చేశారు.

వైవాహిక వ్యవస్థపై, పురుషుల మనోభావాలు దెబ్బ తీనే విధంగా కామెంట్ చేయడంపై కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 21, 2012లో ఆమె స్వయంగా కోర్టుకు హాజరైంది. ఆ తర్వాత కూడా వివాదాస్పద ఇంటర్వ్యూలు, వ్యాఖ్యలతో కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. తమిళ, మలయాళ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ తరహా నటిగా పేరు తెచ్చుకొన్నారు. జంకు, బొంకు లేకుండా తనకు నచ్చినట్టు మాట్లాడుతూ సమస్యల్లో కూరుకుపోతున్నారు.

ఇక తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. గ్లామర్ నటిగా పాపులారిటీ ఉన్నందునే తాను పెళ్లి చేసుకోలేకపోయాను. నేను సాధారణ యువతిని అయితే వంట చేసి.. ఇంటిని చక్కబెట్టే యువతిగా ఉండేదానిని. కానీ ఆ పనులు నేను చేయలేను. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాను. శృంగార నటిగా ముద్ర పడటం వల్లే ఇండస్ట్రీలో నాకు ఒక లాంటి ఇమేజ్ ఏర్పడింది. అది మ్యారేజ్ లైఫ్‌కు అడ్డం పడే అంశంగా మారింది అని ఆమె అన్నారు.

అయితే నాపై పడిన ముద్రను చెరిపి వేసుకోవడానికి టెలివిజన్ సీరియల్స్‌లో తల్లి పాత్రలు వేయాలని ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అందుకే యాక్టింగ్‌కు బ్రేక్ తీసుకొన్నాను. కానీ సినిమా నన్ను మళ్లీ వెనక్కి లాగేసింది. దాంతో స్మోక్ సినిమాకు దర్శకురాలిగా మారాను అని సోనా తన గురించి చెప్పుకొన్నారు.

More from Filmibeat

Read more about: sona heiden smoke mollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X