హీటెక్కించే అందాలతో మరింత డోస్ పెంచిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఇలా అవుతుందని ఎవరు ఊహించి ఉండరు!

సినిమా ప్రపంచంలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు ఇప్పుడు ఊహించని విధంగా మారిపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే వారి గ్లామర్ డోస్ కూడా పెంచేస్తున్నారు. ఒకప్పుడు చాలా క్యూట్ గా కనిపించిన వారు ఇప్పుడు వారి అందాలతో కుర్రాళ్ల మతి పోగొట్టేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం వలన వారి క్రేజ్ ఇంకా పెరిగిపోతోంది. ఇక ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఎస్తేర్ అనిల్ కూడా అదే తరహాలో రోజురోజుకు తన వయ్యారాలతో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటుంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోల వివరాలలోకి వెళితే..

వెంకటేష్ కూతురి పాత్రలో..: ఎస్తర్ అనిల్.. ఈ పేరు చెబితే చాలా మందికి ఈమె ఎవరో తెలియకపోవచ్చు. కానీ దృశ్యం సినిమాలో తరచుగా భయపడుతూ కనిపించిన చిన్న పాప అంటే అందరికీ అర్థం అవుతుంది. విక్టరీ వెంకటేష్, మీనాల చిన్న కుమార్తెగా కనిపించి మెప్పించిన ఈ క్యూట్ బ్యూటీ.. 2010లో నల్లవన్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించింది. ఆ సినిమాతోనే అమ్మడు నటిగా మంచి గుర్తింపు అందుకుంది.

 Esther Anil

చైల్డ్ ఆర్టిస్టుగా బిజీగా..: ఇక 2013లో వచ్చిన దృశ్యం థ్రిల్లర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది. ఆ తర్వాత దృశ్యం-2లో కనిపించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె 2016లో ఉత్తమ బాల నటిగా కేరళ్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును గెలుచుకుంది. వరుసగా తెలుగు, తమిళ రీమేక్ లు దృశ్యం, పాపనాసంలో చేసింది.

17 ఏళ్ళ వయసులో కథానాయికగా..: ఆ తర్వాత తమిళ చిత్రం కుజలిలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ చిత్రం ఇంకా విడుదలకు కాలేదు. జోహార్ అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో ఎక్కడ ఛాన్సు వచ్చినా ఈమె చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చాలా బిజీగా గడుపుతోంది.

Esther Anil

ఎక్కువగా గ్లామరస్ ఫొటోలతో: తనకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాను షేర్ చేసుకుంటూ ఉంటుంది. అమ్మడు ఇటీవల కాలంలో అయితే ఎక్కువగా గ్లామరస్ ఫొటోలతో మతిపోగొట్టేస్తోందనే చెప్పాలి. ఎలాంటి స్టిల్ పోస్ట్ చేసినా కూడా స్టన్ అయ్యేలా చేస్తోంది.

రెడ్ కలర్ డ్రెస్సులో ఘాటైన లుక్: అయితే తజాగా ఈ క్యూట్ బ్యూటీ ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ డ్రెస్సులో రెచ్చిపోయింది. ఈ ఫొటోను దృశ్యం సినిమాలో క్యారెక్టర్ ను పోల్చుకుంటే ఏమాత్రం గుర్తు పట్టలేం. చాలా పద్ధతిగా కనిపించిన చిన్న పాప.. అందాల బొమ్మలా తయారైందంటే నమ్మడం కాస్త కష్టమే. కానీ రెడ్ కలర్ డ్రెస్సులో ఎద అందాలను ఆరబోస్తూ.. పౌట్ పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ చాలా హాట్ గా కనిపిస్తోంది. సింగిల్ పీస్ రెడ్ డ్రెస్సులో ఈమెను చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. కావాలంటే మీరూ ఓసారి లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X