నీదంతా చెత్త యాక్టింగ్.. మహానటి కీర్తి సురేష్ పై డైరెక్టర్ ఫైర్

టాలీవుడ్ లో కీర్తి సురేష్ నటిగా తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రాలతో కెరీయర్ ను ప్రారంభించిన కీర్తీ సురేష్ ప్రస్తుతం ఇండియాలోని ప్రధాన భాషల చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం 'ఉప్పు కప్పురంబు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు డేట్ దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కీర్తి సురేష్ తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన కెరీయర్ ప్రారంభంలో ఎదురైన చేధు అనుభవాలను గుర్తు చేసుకుంది. ఒక దర్శకుడు తనతో ఎంత కఠినంగా మాట్లాడాడో తెలియజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

కీర్తి సురేష్ కు గుర్తింపునిచ్చిన చిత్రాలు..
స్టార్ హీరోయిన్ గా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కీర్తి సురేష్ అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కీర్తి సురేష్ టాలీవుడ్ లోకి మాత్రం నేను శైలజా చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన మహానటితో ఏకంగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది. మిస్ ఇండియా, రంగ్ దే, సర్కారు వారి పాట, భోళా శంకర్, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాలతో అలరించింది. మరోవైపు తమిళం, మలయాళం, హిందీలోనూ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో నటించడం విశేషం.

Malayalam Director Scolded Actress Keerthy Suresh for her Poor Acting Skills

కీర్తి సురేష్ ను తిట్టిన దర్శకుడు..
హీరోయిన్ కీర్తి సురేష్ తన కెరీయర్ ను మలయాళంలోనే ప్రారంభించింది. తొలుత పైలెట్ అనే చిత్రంలో నటించింది. 2000లలో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు రాజీవ్ అంచల్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వరుసగా 5 చిత్రాల్లో నటించి మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తన కెరీయర్ అక్కడ ప్రారంభమైన సయయంలో కీర్తి సురేష్ ను ఓ డైరెక్టర్ తిట్టిన తిట్టకుండా తిట్టాడంట. తన మొదటి సినిమాకు పని చేసిన దర్శకుడు తన నటనపై ఆగ్రహం వ్యక్తం చేశారని తాజాగా కీర్తి సురేష్ తెలియజేసింది.

తన నటనకు ఆ దర్శకుడు అస్సలు సంతృప్తి వ్యక్తం చేయలేదని కీర్తి సురేష్ తెలిపింది. ఒకరోజైతే తన నటన చాలా చెత్తగా ఉందని, వెళ్లి మానిటర్ లో చూసుకోపోమ్మని అమానించాడని కీర్తి సురేష్ తాజాగా వెల్లడించింది. దాంతో తను సెట్ లోనే ఏడ్చేశానని చెప్పింది. అలా తను కూడా కెరీయర్ ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

ఉప్పు కప్పురంబు చిత్రం..
కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు. ఈ చిత్రంలో సుహాస్ కూడా కీలక పాత్రలో నటించారు. కామెడీ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. వసంత్ మరిగంటి కథ అందించగా రాధిక అని ఐవీ శశి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కు సిద్ధమైంది. జూలై 4న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది.

More from Filmibeat

Read more about: keerthy suresh suhas tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X