హనీ రోజ్‌కు చేదు అనుభవం.. బాలయ్య హీరోయిన్‌కి అలాంటి వేధింపులు

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావంటూ కేరళ ప్రభుత్వం నియమించిన జస్టిస్ హేమ కమిటీ బయటపెట్టిన నిజాలు గతేడాది చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. క్యాస్టింగ్ కౌచ్‌, మహిళలపై వేధింపులు వంటివన్నీ అన్ని పరిశ్రమల్లో ఉన్నప్పటికీ.. కేరళలో మహిళా నటులు దయనీయ స్థితిలో ఉన్నారని హేమ కమిటీ పేర్కొంది. మలయాళ ఇండస్ట్రీ అనధికారికంగా ఓ మాఫియా కనుసన్నల్లో నడుస్తోందని కమిటీ ఆరోపించింది. మహిళా నటులు తమపై జరిగే లైంగిక వేధింపులు, దాడులపై నోరు విప్పలేకపోతున్నారని జస్టిస్ హేమ కమిటీ పేర్కొంది.

హేమ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు ధైర్యంగా ముందుకొచ్చి తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతున్నారు. పైకి పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న కొందరి నిజస్వరూపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఉండటంతో ప్రజలు, సినీ జనాలు నిర్ఘాంతపోతున్నారు. మలయాళంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోయిన్లు , నటీమణులు కూడా ఒక్కొక్కరిగా తమకు జరిగిన అన్యాయాలను నేటికీ బయటపెడుతున్నారు.

Malayalam Heroine Honey Rose Accuses A Business Man Of Stalking Instagram post goes viral

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కమీషన్ వేయాలంటూ స్టార్ హీరోయిన్ సమంత తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. మలయాళ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెరపైకి తీసుకురావడంలో కేరళలోని వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) చేసిన కృషిని సామ్ ప్రశంసించారు. టాలీవుడ్‌లోనూ ది వాయిస్ ఆఫ్ వుమెన్ ఏర్పాటైందని.. ఈ సబ్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని సమంత కోరారు.

మలయాళ పరిశ్రమకి చెందిన కొందరు ప్రముఖులు రంగంలోకి దిగి ఇష్యూని కొత్త డైవర్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే స్టార్ హీరోయిన్ హనీ రోజ్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తనను ఓ వ్యాపారవేత్త ఉద్దేశపూర్వకంగా అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు. తాను వెళ్లే కార్యక్రమాలకు , ఈవెంట్స్‌కి ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా వస్తున్నాడని.. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తన పేరును మీడియాలో ప్రస్తావిస్తూ అవమానిస్తున్నారని హనీ రోజ్ పేర్కొన్నారు.

సదరు వ్యక్తి కొన్ని కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించినప్పుడు తాను నిరాకరించానని.. దీంతో నాపై కక్ష సాధింపు చర్యలకు దిగిన ఆయన ఉద్దేశపూర్వకంగా నేనే పాల్గొనే కార్యక్రమాలకు హాజరవుతూ నా పేరుని తీస్తున్నాడని హనీ రోజ్ వ్యాఖ్యానించారు. డబ్బు ఉందన్న గర్వంతో ఇలా అవమానిస్తారా? నేను రెండేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని ఇలాంటి మాటలను ఎందుకు పడాలని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇక అతని ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొనేది లేదని.. అతను ఇలాగే నన్ను మానసికంగా చిత్రవధ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయిస్తానని హనీరోజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఈ ముద్దుగుమ్మను ఇంతలా వేధిస్తోన్న ఆ వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు , సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X