ఛాలెంజ్‌లతో ఒళ్ళు చూపించడం కాదు.. ఈ హీరోయిన్‌లా పొలంలో పని చేయగలరా?

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఛాలెంజ్‌లతో సరదాగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారలు రోజుకో ఛాలెంజ్ అంటూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ అయితే గ్లామర్ గా రోజుకో డ్రెస్ తో టాస్క్ లు వదులుతున్నారు. ఇక మరికొందరైతే ఒళ్ళు కనిపించేలా పిల్లో ఛాలెంజ్, పేపర్ ఛాలెంజ్ అంటూ హడావుడి చేస్తున్నారు. కానీ హీరోయిన్ కీర్తి పాండియన్ చేస్తున్న పని మాత్రం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆమె ఏం చేశారంటే..

 లాక్ డౌన్ ఎఫెక్ట్..

లాక్ డౌన్ ఎఫెక్ట్..

ఎప్పుడు లేని విధంగా కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ దెబ్బకు సినీ తారలకు పని లేకుండా పోయింది. రోజంతా షూటింగ్స్, పార్టీలు అంటూ బిజీగా ఉండే స్టార్ సెలబ్రెటీస్ ఇళ్ళల్లోనే కాలాన్ని గడిపేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పనులు చేస్తూ ఇతర స్టార్స్ కి కూడా ఛాలెంజ్ లు విసురుతున్నారు.

గ్లామర్ ఛాలెంజ్..

గ్లామర్ ఛాలెంజ్..

ఇక హీరోయిన్స్ చాలా వరకు గ్లామర్ తో నెటీజన్స్ ని ఆకట్టుకునేలా ఛాలెంజ్ లు విసురుతున్నారు. ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ అయితే దిండుని కూడా డ్రెస్ గా మార్చేసింది. మరుసటి రోజు డోస్ పెంచుతూ.. పేపర్స్ ని కూడా డ్రెస్ లా చేసి అందాలను దాచేసుకుంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కొందరు ఈ బ్యూటీని ట్రోల్ కూడా చేశారు.

ఈ హీరోయిన్ చాలా గ్రేట్..

ఈ హీరోయిన్ చాలా గ్రేట్..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువగా గ్లామర్ ఛాలెంజ్ అలాగే కిచెన్ ఛాలెంజ్ అంటుంటే.. ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా పొలంలోకి దిగు ఒళ్ళు వంచి పని చేసింది. దీంతో నెటీజన్స్ ఆ యంగ్ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఎవరో కాదు.. మలయాళం బ్యూటీ కీర్తి పాండియన్. తుంబ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. హీరో కమ్ విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన అరుణ్ పాండియన్ కూతురే ఈ ముద్దుగుమ్మ.

Recommended Video

National Film Awards : Keerthi Suresh Receive Best Actress award From VP Naidu
నిజమైన బ్యూటీ..

నిజమైన బ్యూటీ..

నాలుగు గోడల మధ్య ఎదో వీడియో కోసం ఛాలెంజ్‌లు చేయడం కాకుండా కీర్తి పాండియన్ మాత్రం కొత్తగా ఆలోచించి వారి కుటుంబానికి చెందిన పొలంలో ఫీమేల్ ఫార్మర్ గా పని చేసింది. టాక్టర్ నడపడమే కాకుండా.. కూలీలతో సమానంగా వరి నాట్లు కూడా వేస్తోంది. కెమెరా ముందు గ్లామర్ గా కనిపించే ఈ బ్యూటీ.. మట్టిలో కష్టపడుతున్నప్పుడు కూడా చాలా అందంగా ఉందని నెటీజన్స్ పాజిటివ్ గా కామేంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X