బాయ్స్ ఫ్రెండ్ తో బ్రేకప్.. ప్రజెంట్ సింగిల్ అంటున్న ఐటమ్ బ్యూటీ..

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల రిలేషన్స్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తాయి. ప్రేమ, పెళ్లిళ్లు, విడాకులు అంటూ తరచూ న్యూస్ లో నానుతూ ఉంటారు. తాజాగా ఓ ఐటమ్ బ్యూటీ తాను తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానంటూ పేర్కొంది. ఇంతకీ ఆ హాట్ బ్యూటీ ఎవరు? తన బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ బ్రేక్ చేయడానికి కారణం ఏంటి ? వివరాలోకి వెళ్తే..

ఐటమ్ బ్యూటీ ఎవరో కాదు బాలీవుడ్ అందాల తార మల్లికా శెరావత్ (Mallika Sherawat). ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో సిల్వర్ స్క్రీన్ పై దుమ్మురేపుతోంది. తన గ్లామర్ షోతో కుర్రాకారుకు చెమటలు పట్టిస్తోంది. ఈ హాట్ బ్యూటీ 2004లో మర్డర్ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇందులో బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయి నటించింది. దీంతో ఈ హాట్ బ్యూటీ కి ఎనలేని పాపులాటి వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

Mallika Sherawat Confirms Her Breakup With French Boyfriend Cyrille Auxenfans

ఈ అమ్మడు కేవలం ఐటమ్ సాంగ్స్ కాకుండా.. పలు యాక్షన్ మూవీలలో నటించి మెప్పించింది. హాలీవుడ్ సినిమాలలో కూడా ఈ గ్లామర్ బ్యూటీ తన అందాలను ఆరబోసింది. మల్లికా శెరావత్ కెరియర్ ల్లో కిస్ కిస్కి కిస్మత్, వెల్కమ్, థాంక్స్, తేజ్ ,జిన్నత్ ,డర్టీ పాలిటిక్స్ వంటి సినిమాలు మంచి గుర్తింపుని తెచ్చాయి.

ఆ తర్వాత సౌత్ లోనూ ఆఫర్లు అందుకుంది. ఇలా దశావతారం సినిమాల్లో నటించి తన అందాలను ఆరబోసింది మల్లికా శెరావత్. ఇటీవల విక్కి విద్య క హో వాల వీడియో అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. గత నెల అక్టోబర్ 11న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ సొంతం చేసుకుంది. త్వరలో ఓటీడీలో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లికా శెరావత్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.

Mallika Sherawat Confirms Her Breakup With French Boyfriend Cyrille Auxenfans

ఆ ఇంటర్వ్యూలో ఆ మాట్లాడుతూ గతంలో తాను ఓ వ్యక్తిని ప్రేమించానని, అయితే ప్రస్తుతం ఆ వ్యక్తితో తనకు బ్రేకప్ అయిందని దానివల్ల ఇప్పుడు ఏమి మాట్లాడదలచుకోవడం లేదని ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానంటూ వెల్లడించింది. పెళ్లిపై తనకు భిన్నభిప్రాయాలు ఉన్నాయని, తన మనసుకు నచ్చిన వ్యక్తిని పొందడం ఈరోజుల్లో కష్టమే అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలాగే శరీరాకృతి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని మంచి భోజనం తీసుకుంటూ సమయానికి నిద్రపోతున్నానని పేర్కొంది.

తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పుకొచ్చింది. అలాగే డైరెక్టర్ సినిమాలు ఒప్పుకునే ముందు తన క్యారెక్టర్ గురించి అన్ని రకాలుగా తెలుసుకొని ఒప్పుకుంటున్నానని, అందుకే నెట్ ఫిక్స్ ప్రాజెక్ట్ను తిరస్కరించాలని క్లారిటీ ఇచ్చింది. తన ఫ్రెంచ్‌ ప్రియుడు సిరిల్ ఆక్సెన్‌ఫాన్స్‌తో బ్రేక‌ప్ అయిన‌ట్లు తెలిపింది. సిరిల్ ఆక్సెన్‌ఫాన్స్‌తో బ్రేక‌ప్ అయిందనీ. తాను ఇద్దరం చాలా కాలం పాటు క‌లిసి ఉన్నామని, కానీ విడిపోయామని తెలిపారు. ఇక ప్రియుడితో విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు అయితే చెప్ప‌లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X